నిర్మాతగా మారబోతున్న యాంకర్ అనసూయ

0
499

బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ అనతి కాలంలోనే స్టార్ యాంకర్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. జబర్దస్తు కామెడీ షోతో ఆమె ఎంతో ఫేమస్ అయ్యారు. ఒకానొక సమయంలో అత్యధికంగా పారితోషకం తీసుకునే యాంకర్ స్థాయికి ఆమె ఎదిగారు. ఆ తర్వాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుని సక్సెస్ అయ్యారు. సోగ్గాడే చిన్ని నాయనా, రంగస్థలం, యాత్ర వంటి సినిమాల్లో ఆమె తళుక్కున మెరిశారు.

అన్నింటికంటే రంగస్థలంలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఆమె చేతిలో ఇప్పుడు సినిమా ఆఫర్లు చాలానే ఉన్నాయి. ఆమె ప్రధాన పాత్రలో కథనం అనే సినిమా కూడా రూపొందుతోంది. అయితే తాజాగా ఆమె వాషింగ్టన్ లో జరిగిన 22వ తానా సభలకు హాజరయ్యారు. అక్కడ ఆమె నిర్మాతగా కూడా మారుతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. నిర్మాతగా మారి సినిమాలను నిర్మించనున్నట్లు ఆమె తెలిపారు. దీంతో యాంకర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విజయం సాధించిన అనసూయ నిర్మాతగా ఏ మేర ఆకట్టుకుంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆమె నిర్మించ బోయే సినిమా వివరాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here