మాటల మాంత్రికుడిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం ఒక మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ లోను, అలానే టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలున్నాయి.
ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, యువ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు యూనిట్ సభ్యులు కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ సినిమాకు పి ఎస్ వినోద్ సినిమాట్రోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు…..!!


