సీక్రెట్‌ టాటూ బయటపెట్టిన సమంత

0
167

టాలీవుడ్ బేబీ అక్కినేని సమంత శరీరంపై మరో టాటూ బయటపడింది. సమంత ఈ టాటూని ప్రేక్షకుల కంట పడకుండా గత కొన్నేళ్లుగా దాస్తున్నారు. కానీ, ఓ బేబీ సినిమా నిర్వహించిన థాంక్స్ మీట్ లో జరిగిన ఫోటో షూట్ కు ఫోజులిచ్చినప్పుడు సమంత సీక్రెట్ టాటూ బయటపడింది. ఆ ఫోటో షూట్ లో సమంత వైట్ కలర్ కాస్ట్యూమ్స్ ధరించి ఏంజెల్ లా ఉన్నారు. ఇన్ని రోజులు ఎన్నో ఫోటో షూట్స్ లో ఫోటోలకు ఫోజులిచ్చినా కానీ బయటపడని టాటూ ఈసారి సమంత చేతులు పైకెత్తి ఫోజు ఇవ్వడంతో ఆమె కుడి వైపు ఉన్న టాటూ బయటపడింది.

దీంతో అభిమానులు ఆ టాటుపై రీసెర్చ్ మొదలు పెట్టకముందే ఆమె ఆ టాటూ ఏంటో చెప్పేసారు. తన ప్రియమైన భర్త నాగచైతన్య పేరును సమంత పచ్చబొట్టు వేయించుకున్నారు. ఈ ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ..‘ఉత్తమ జీవితాన్ని గడుపుతున్నా.. నేను దాచిపెట్టిన ఒకే ఒక్క టాటూ ఆఖరికి బయటపడింది. నా భర్త నాగచైతన్య నా ప్రపంచం’ అంటూ ప్రేమ గుర్తులను కాప్షన్ గా పెట్టారు. అయితే నాగచైతన్య, సమంత చేతిపై ఒకేరకం టాటూని వేయించుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ టాటూ ఫొటోలు కూడా వైరల్‌ అయ్యాయి. వారిద్దరూ వేయించుకున్న టాటూ గురించి ఆమె ప్రస్తావిస్తూ..‘దీని అర్థం మీ జీవితం మీరు చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. అంతేకానీ ఇతరుల మాటల్ని బట్టి కాదు’ అని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here