10 రోజుల్లో రూ.15 కోట్లు రాబట్టిన “బ్రోచేవారెవరురా”…..!!

0
2596

విభిన్న కథా చిత్రాలలో తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటుడు శ్రీవిష్ణు. ఆయన నటించిన కొత్త చిత్రం బ్రోచేవారెవరురా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను రాబడుతోంది. ఇప్పటికే విడుదలై 10 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు రూ.15 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. ముగ్గురు మిత్రుల మధ్య స్నేహం ప్రధానాంశంగా ఆకట్టుకునే కథను వినోదాత్మకంగా తెరకెక్కించడంలో ఈ చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ పూర్తిగా సఫలం అయ్యారు.

ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్ స్వరపరచిన పాటలు కూడా సినిమాకు మంచి ప్లస్ అయ్యాయి. శ్రీవిష్ణు తోపాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నివేత థామస్, నివేత పేతురాజ్, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్ పై విజ‌య్ కుమార్ మ‌న్యం నిర్మించడం జరిగింది. ఇక ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతున్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరింత కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here