‘నిను వీడని నీడను నేనే’ ప్రి రిలీజ్ వేడుకకు ప్రత్యేక అతిథులుగా యువ హీరోలు

0
83

యువ సంచలన నటుడు సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ నిను వీడని నీడను నేనే. హర్రర్ కథాంశంతో వినోదాత్మకంగా సాగే కథ మరియు కథనాలతో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది. ఇదివరకు వచ్చిన హర్రర్ మూవీస్ కు  భిన్నమైన బ్యాక్ డ్రాప్ లో తమ సినిమా రూపొందుతోందని, తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని యూనిట్ సభ్యులు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. కార్తిక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుక ఈ నెల 10 న హైదరాబాద్ లో ఘనంగా జరుగనుంది.

ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా నటులు సుధీర్ బాబు మరియు నిఖిల్ సిద్దార్థ, అలానే అతిథులుగా ఇటీవల తమ తాజా చిత్రాలతో అద్భుత విజయాలను సొంతం చేసుకున్న శ్రీవిష్ణు, విశ్వక్ సేన్, కార్తికేయ, ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ తదితరులు హాజరు కానున్నారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాని సమర్పిస్తుండగా, తొలిసారి ఈ సినిమాతో సందీప్ కిషన్ నిర్మాణ రంగంలోకి అడుగుపెతున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ప్రొడక్షన్స్ పతాకంపై దయా పన్నెం, విజి సుబ్రహ్మణ్యన్ తో కలిసి వి స్టూడియోస్ వారి భాగస్వామ్యంతో సందీప్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. సందీప్ సరసన అన్యా సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here