ముష్టియా బారిన పడ్డ రకుల్ ప్రీత్‌

0
55

రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు ముంబయిలో పోకిరిలో బ్రహ్మానందంకు జరిగినట్లే జరిగింది. పోకిరి సినిమాలో బ్రహ్మానందం చుట్టూ బిచ్చగాళ్ళు వెంటపడుతూ ఎలా ఏడిపిస్తారో మనందరికీ తెలిసిందే. ఎవరు మీరని అడిగినప్పుడు మాఫియా లాగే మాది ముష్టియా అంటాడు అలీ. చూడ్డానికి సరదాగా అనిపించిన ఈ సన్నివేశం నిజజీవితంలో రకుల్ ప్రీత్ సింగ్‌కు ఎదురైంది. ముంబైలో ఓ ప్రముఖ రెస్టారెంట్‌లోకి వెళ్లి, బయటికి వచ్చిన ఆమెను బిచ్చం వేయమంటూ కొందరు చిన్నారులు తగులుకున్నారు.

అంతేకాదు డబ్బుల కోసం ఏకంగా ఆమె జేబులో చేతులు పెట్టారు. చివరికి ఆమె కారు ఎక్కడానికి వెళ్తుంటే అడ్డుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నారుల ప్రవర్తనను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి బెగ్గింగ్ మాఫియాను ఎప్పుడూ ప్రోత్సహించొద్దని.. ఆమె జేబులో ఎలా చేతులు పెడుతున్నారో చూడండంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి వారికి డబ్బులు ఇవ్వకూడదు. వీళ్లు చాలా ఘోరంగా ప్రవర్తించారు, డబ్బుల కోసం ఇతరుల్ని ఇలా వేధించడం సరికాదంటున్నారు. చిన్నారులు ఎందుకు బిక్షాటన చేస్తున్నారు.. స్థానిక రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు పేద చిన్నారుల సంరక్షణ చూసుకుంటున్నారు కదా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here