నేడు ఘనంగా జరుగనున్న ‘దొరసాని’ ప్రీరిలీజ్ వేడుక……!!

0
36

యువ నటులు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ తొలిసారి టాలీవుడ్ తెరకు పరిచయం అవుతున్న చిత్రం దొరసాని. కొన్నేళ్ల క్రితం తెలంగాణ ప్రాంతంలో జరిగిన యదార్ధ గాథను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మరియు పాటలు చిత్రంపై అంచనాలను మరింత పెంచాయనే చెప్పాలి. ట్రైలర్ లోని యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, అలానే ఆనంద్ మరియు శివాత్మిక పలికిన డైలాగులు వీక్షకులను ఎంతో ఆకర్షించాయి.

ఇకపోతే ఈ చిత్ర ప్రి రిలీజ్ వేడుకను నేడు సాయంత్రం హైదరాబాద్ లోని ఫిలిం నగర్ వద్ద గల జె ఆర్ సి కన్వేషన్ సెంటర్లో సాయంత్రం 6 గంటల నుండి చిత్ర బృందం మరియు అతిథుల సమక్షంలో ఎంతో వేడుకగా జరపబోతున్నట్లు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రానికి సమర్పణ: డి.సురేష్ బాబు, సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి, ఎడిటర్ : నవీన్ నూలి, సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి, ఆర్ట్ డైరెక్టర్ : జె.కె మూర్తి, పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా, కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని, నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని, రచన, దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, చిత్రాన్ని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here