సూపర్ స్టార్ రజినీకాంత్ గారితో పనిచేయాలని ఉంది : దేవిశ్రీ ప్రసాద్

0
414

టాలీవుడ్ లో రాక్ స్టార్ గా తన వినసొంపైన సంగీతంతో ఎందరో అభిమానులను సంపాదించిన యువ సంగీత తరంగం దేవి శ్రీప్రసాద్. తన గురువు గారైన మాండలిన్ శ్రీనివాస్ గారు తనకు తండ్రితో సమానమని,  తన తండ్రి సత్యమూర్తి గారి మరణం తనకు ఎన్నటికీ మరువలేనంత బాధను మిగిల్చిందని, దేవిశ్రీప్రసాద్ నేడు క్లబ్ క్లాస్ మ్యాగజైన్ అనే జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.  మైఖేల్ జాక్సన్, ఇళయరాజా వంటి వారే తన సంగీతానికి స్ఫూర్తి అని దేవి అన్నారు. ప్రపంచంలో దేనినుండి అయినా సంగీతాన్ని సృష్టించవచ్చని, ఇక నేడు అది మరింత విస్తృతం అయిందని అయన అన్నారు.

తెలుగులో మెగాస్టార్ మొదలుకుని నాచురల్ స్టార్ నాని వరకు, అలానే హిందీలో సల్మాన్ వంటి దిగ్గజ నటుడితో, ఇక తమిళ్ లో కార్తీ, సూర్య, అజిత్, విజయ్ వంటివారందరితో తాను పని చేసానని, అయితే తనకు ఒక్క కల మాత్రం మిగిలిపోయిందని, అదే సూపర్ స్టార్ రజినీకాంత్ గారితో పనిచేయడం అని చెప్పారు దేవి. ఆ అవకాశం కోసం తాను ఎన్నాళ్ళనుండో ఎదురుచూస్తున్నానని, మరి అంతటి అద్భుత అవకాశాన్ని దేవుడు తనకు ఎపుడు ఇస్తాడో చూడాలని అయన అభిలషించారు. ఇక కథను బట్టి, అలానే ఆయా చిత్రాల దర్శక, నిర్మాతల అభిరుచులను బట్టి తాను ఒక చిత్రానికి సంగీతాన్ని అందిస్తానని, అంతేకాని తనకు చిన్న, పెద్ద అనే చిత్రాలు అనే తేడా ఉండదని అయన అన్నారు. ఇక రాబోయే రోజుల్లో సంగీతంలో సరికొత్త విప్లవాలు వచ్చే అవకాశం లేకపోలేదని ఆయన స్పష్టం చేసారు ….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here