ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న “ఇస్మార్ట్ శంకర్”

0
333

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం ఇస్మార్ట్ శంకర్. పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నటి ఛార్మి సహ నిర్మాతగా, పూరి జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. టీజర్ విడుదల తరువాత చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పాలి. ఆకట్టుకునే మాస్ కథాంశంతో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆయన సారథ్యంలో ఇటీవల విడుదలైన పాటలు కూడా మంచి ప్రేక్షకాదరణ పొందాయి. చిత్రాన్ని ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. సత్య దేవ్, పునీత్ ఇస్సార్, షాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, రావు రమేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్ జునైద్ సిద్దిఖి అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ గా రాజ్ తోట పని చేస్తున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here