యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతున్న ‘కల్కి’ హానెస్ట్ ట్రైలర్….!!

0
366

‘అ’ వంటి విభిన్న తరహా చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ గారు హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం కల్కి. ఇక ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన రెండు పాటలు మరియు ట్రైలర్, చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెంచాయి అనే చెప్పాలి. ఇక నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర హానెస్ట్ ట్రైలర్, ప్రేక్షకుల ఆదరణతో ప్రస్తుతం యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

రాజశేఖర్ సరసన ఆదా శర్మ, నందిత శ్వేతా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, అశుతోష్ రాణా, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని హ్యాపీ మూవీస్ బ్యానర్ పై నిర్మాత సి కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఇప్పటికే సెన్సార్ బోర్డు నుండి యు/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here