క్లీన్ యు సర్టిఫికెట్ పొందిన “బ్రోచేవారెవరురా”….!!

0
71

వైవిధ్య చిత్రాల హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సరికొత్త చిత్రం బ్రోచేవారెవరురా. నిన్న ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరుపుకున్న ఈ చిత్రం, ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక తమ చిత్రానికి సెన్సార్ సభ్యుల నుండి క్లీన్ యూ సర్టిఫికెట్ లభించిందని చిత్ర బృందం ప్రకటించడం జరిగింది.

నివేత థామస్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ‌ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా, సంగీతాన్ని వివేక్ సాగ‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీని సాయి శ్రీరాం అందిస్తున్నారు. మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్ పై విజ‌య్ కుమార్ మ‌న్యం ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకగా నిర్మిస్తున్నారు. వినూత్నమైన కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రంపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here