యాంగ్రీ స్టార్ గా పేరుగాంచిన రాజశేఖర్, ఇటీవల నటించిన సూపర్ హిట్ చిత్రం పి ఎస్ వి గరుడ వేగా. దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందించిన ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీని జ్యో స్టార్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఎమ్ కోటేశ్వర రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఇక త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించనున్నట్లు హీరో రాజశేఖర్ నిన్న ప్రకటించడం జరిగింది.
ఇక ఈ చిత్రానికి కూడా దర్శకుడుగా ప్రవీణ్ సత్తారు గారే వ్యవహరిస్తారని, తమ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని మించే స్థాయిలో ఉంటుందని అయన అన్నారు. అతిత్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రానికి సంబందించిన మిగతా వివరాలు మరికొద్దిరోజుల్లో వెల్లడికానున్నాయి


