‘మల్లేశం’ చిత్రాన్ని అభినందించిన దర్శకుడు హరీష్ శంకర్

0
90

ఇటీవల టాలీవుడ్ లో విడుదలైన కొత్త చిత్రాల్లో ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టి ముందుకు సాగుతున్న చిత్రం మల్లేశం. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ చింతక్రింది మల్లేశం జీవిత గాథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం పై ప్రేక్షకులు సహా కొందరు సినీ ప్రముఖులు సైతం ప్రశంశలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ లో మాస్ మరియు కమర్షియల్ చిత్రాల దర్శకుడుగా పేరుగాంచిన హరీష్ శంకర్ మల్లేశం చిత్రంపై తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు.

వినోదం, బాధ, ఆవేదన వంటి అన్ని ఎమోషన్స్ కలగలిపి తీసిన ఈ మల్లేశం చిత్రం తనకు ఎంతో నచ్చిందని, ఇక ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి సక్సెస్ సాధించిన బయోపిక్స్ లో మల్లేశం కూడా ఒకటి అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు. హాస్యనటుడిగా అలరిస్తూ, ఇంతటి గొప్ప పాత్రలో ఒదిగిపోయి నటించిన నటుడు ప్రియదర్శిని అభినందించారు . రాజ్ గారి దర్శకత్వం, అశోక్ గారి డైలాగ్స్  అద్భుతంగా ఉన్నాయని వాళ్ళ కష్టం సినిమాలో కనిపించిందని అన్నారు. అలానే ఈ చిత్రాన్ని ఎంతో గొప్పగా నిర్మించడంలో నిర్మాతల అభిరుచి మనకు అర్ధం అవుతుందని ఈ సినిమా వళ్ళ అపార భగీరధుడు వంటి మల్లేశం గారి గురించి తెలిసిందన్నారు. సినిమా చూసిన వెంటనే పేరెంట్స్ తో సినిమా చూడాలనుకున్నానని ఎప్పుడో కానీ ఇటువంటి సినిమాలు రావని అందరు చూడాలని చెప్పారు.   మల్లేశం వంటి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించినందుకు టీమ్ కు తన తరపున శుభాభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here