“ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” పై ప్రశంశలు కురిపించిన విజయ్ దేవరకొండ, అడివి శేష్…!!

0
39

ప్రస్తుతం టాలీవుడ్ లో విడుదలైన కొత్త చిత్రాల్లో ప్రేక్షకుల మెప్పుతో సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్న చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. డిటెక్టీవ్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో హీరో నవీన్ పోలిశెట్టి నటనకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి.

ఇకపోతే ఈ చిత్రంపై నేడు యువ హీరోలు విజయ్ దేవరకొండ, అడివి శేష్ తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ఈరోజే ఈ చిత్రాన్ని చూడడం జరిగిందని, సినిమా ఆద్యంతం ఎంతో ఆకట్టుకునేలా సాగుతూ ప్రేక్షకుడికి మంచి వినోదాన్ని పంచుతూ ముందుకు సాగిన తీరు చాలా బాగుందని, ఇక దర్శకుడు స్వరూప్ చిత్రాన్ని నడిపించిన తీరు అలానే నటుడు నవీన్ సహా చిత్రంలోని పాత్రలన్నీ కూడా ఎంతో అలరించాయని వారు చెప్పుకొచ్చారు. నవీన్ హీరోగా నటించిన తొలిచిత్రమే మంచి సక్సెస్ ని సాధించడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో అతడు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నట్లు వారిద్దరూ శుభాభినందనలు తెలిపారు.

ఇక వారిద్దరితోపాటు దర్శకుడు తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here