‘బ్రోచేవారెవరురా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రత్యేక అతిథులుగా ఇస్మార్ట్ రామ్, నారా రోహిత్….!!

0
85

ఇటీవల మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటుడు శ్రీవిష్ణు. అయన హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం బ్రోచేవారెవరురా. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో నివేత థామస్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చ‌ల‌న‌మే చిత్ర‌ము చిత్ర‌మే చ‌ల‌న‌ము అనే ఉపశీర్షికతో రాబోతున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. విలక్షణమైన కథ, మరియు కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రం మంచి సక్సెస్ ని సాదిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఇక చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రేపు హైదరాబాద్, హైటెక్స్ రోడ్ లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ఎనర్జిటిక్ హీరో రామ్ మరియు టాలెంటెడ్ హీరో నారా రోహిత్ ప్రత్యేక అతిథులుగా హాజరవవుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కుమార్ మ‌న్యం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 28న విడుదల చేయనున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here