వ‌రుణ్ తేజ్‌, హ‌రీష్ శంక‌ర్ ల `వాల్మీకి` పవర్ ఫుల్ ప్రీ-టీజర్ విడుదల

0
103

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం వాల్మీకి. ఇటీవల తమిళ్ లో విడుదలై, అక్కడ సంచలన విజయాన్ని నమోదుచేసుకున్న జిగర్తాండ అనే చిత్రానికి అధికారిక రీమేక్ గా రూపొందుతున్న వాల్మీకి పై టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ అలానే మెగా అభిమానుల్లోను మంచి అంచనాలున్నాయి. మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా దర్శకుడు హరీష్ శంకర్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రీ టీజర్ ని చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. టీజర్ లో నల్ల దుస్తుల్లో, గుబురుగా పెరిగిన జుట్టు మరియు గడ్డంతో వరుణ్ తేజ్ చూడ్డానికి ఎంతో వెరైటీ గా కనపడుతున్నారు. ఇక ఈ టీజర్ తో సినిమా పై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ చిత్రంలో మిళ హీరో అధ‌ర్వ ముర‌ళి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. 14రీల్స్ ప్లస్ ఎంటటైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నారు…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here