‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ప్రీ రిలీజ్ వేడుకకు సాయి ధరమ్ తేజ్….!!

0
455

డిటెక్టీవ్ జానర్లో వస్తున్న కొత్త సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రానికి స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వం వహించారు. స్వధర్మ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుండి నుండి విశేష స్పందన వచ్చింది . ఆద్యంతం మంచి ఎటెర్టైనింగ్ గా సాగే ఈ చిత్రంలో హీరో నవీన్ నటన చిత్రానికి హైలైట్ అని అంటోంది చిత్ర బృందం. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నేడు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్, ఫిలిం నగర్ ప్రాంతంలోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో అతిథుల మధ్య ఘనంగా నిర్వహించనున్నారు. కాగా ఈ వేడుకకు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రత్యేక అతిథిగా రాబోతున్నట్లు చిత్ర బృందం కాసేపటి క్రితం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మార్క్ కే రాబిన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here