ఆది బుర్రకథ విడుదల తేదీ ఖరారు….!!

0
460

ఆది సాయికుమార్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం బుర్రకథ. మాటల రచయిత డైమండ్ రత్నబాబు తొలిసారి మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది.

ఈ చిత్రంలో కథానాయకుడు రెండు మెదళ్ళు కలిగి ఉండడం అనే విభిన్న కథాంశంతో పూర్తి స్దాయి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆదికి జోడిగా మిస్తీ చక్రవర్తి నటిస్తుండగా, రాజేంద్ర ప్రసాద్‌, పోసాని కృష్ణ మురళీ, పృథ్వీ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. సాయి కార్తీక్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here