వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ ల “వాల్మీకి” ప్రీ టీజర్ త్వరలో విడుదల….!!

0
508

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం వేగవంతంగా జరుగుతోంది.  ఇటీవల షూటింగ్ సందర్భంగా హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న చిత్ర బృదం కారు చిన్న ప్రమాదానికి గురైన సంగతి విదితమే. అయితే ప్రమాదంలో ఎవరికీ ఏమి కాకపోవడంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. ఇకపోతే ఈ చిత్ర ప్రీ టీజర్ ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు దర్శకుడు హరీష్ శంకర్ కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రకటించడం జరిగింది.

త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ప్రీ టీజర్ ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది . ఇక వరుణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here