సందీప్ కిషన్ నటిస్తున్న ‘నిను వీడని నీడను నేనే’ విడుదల తేదీ ఖరారు…!!

0
557

యువ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. కాగా అందులో కార్తీక్ రాజు దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ముందుగా విడుదల కానుంది. ‘నిను వీడని నీడను నేనే’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టింది.  ఈ చిత్రాన్ని జులై 12న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు కాసేపటి క్రితం చిత్ర బృందం ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ పాత్ర హైలైట్ అంటున్నారు.

సందీప్ సరసన అన్య సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతాన్ని యువ సంగీత తరంగం థమన్ అందించారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, తొలిసారి ఈ చిత్రంతో సందీప్ కిషన్ సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెతున్నారు. తాను స్థాపించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ప్రొడక్షన్స్ పతాకంపై దయా పన్నెం, విజి సుబ్రహ్మణ్యన్ తో కలిసి వి స్టూడియోస్ వారితో కలిసి సంయుక్తంగా అయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో వేడుక అతి త్వరలో విడుదల జరుగనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాకు కేఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా పనిచేస్తుండగా, పీకే వర్మ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here