యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సాహో. ఇక ఎన్నో అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా టీజర్ అద్భుతమైన వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి తన అనుభవాలను ఒక జాతీయ మీడియాతో పంచుకున్నారు హీరో ప్రభాస్. ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాని సుజిత్ మరియు తన టీమ్ దాదాపుగా మూడేళ్ళుగా ఎంతో శ్రమపడుతున్నారని, ఇది పక్కా స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా అని, రేపు విడుదల తరువాత తప్పకుండా ప్రేక్షకులకు ఈ సినిమా అన్నివిధాలుగా చేరువ అవుతుందన్న నమ్మకం తనకు ఉందని అయన అన్నారు.
తన నుండి ప్రేక్షకులు ఆశిస్తున్న అన్నాయి అంశాలు ఇందులో ఉన్నాయని, ఇంత పెద్ద భారీ యాక్షన్ యాక్షన్ సినిమాకి అన్నివిధాలా సహకరించిన నిర్మాతలు వంశీ, ప్రమోద్ కు అయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ప్రబాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, మురళి శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సినిమా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర బృందం….!!


