సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో 25వ సినిమాగా రూపొందిన మహర్షి సూపర్ సక్సెస్ సాధించడంతో మహేష్ బాబుతో పాటు అయన అయన అభిమానులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కెరీర్ పరంగా వరుసగా రెండు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న తమ సూపర్ స్టార్, త్వరలో చేయబోయే 26వ సినిమా సరిలేరు నీకెవ్వరుతో హ్యాట్రిక్ విజయాలు అందుకోవాలి కోరుకుంటున్నారు. ఇక మహర్షి సినిమా నైజాం ప్రాంతంలో ఒక అద్భుతమైన రికార్డుని నెలకొల్పింది.

ఈ సినిమా నైజాంలో రూ.30 కోట్లకు పైగా షేర్ ని సాధించి ఇంకా 102 థియేటర్లలో అక్కడ విజయ ఢంకా మోగిస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఓవర్ ఆల్ గా రూ.100 కోట్ల షేర్ మార్కును దాటేసిన మహర్షి, 6వ వారంలో కూడా మంచి వసూళ్లు రాబడుతుండడం విశేషం …!!