రేపు ఘనంగా జరుగనున్న ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ….!!

0
25

డాల్ఫిన్ ఎంటర్‌టైన్‌మెంట్- మారుతీ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ఫస్ట్ ర్యాంక్ రాజు. విద్య 100% బుద్ధి 0% అనే ఉపశీర్షిక రాబోతున్న ఈ చిత్రం, ప్రస్తుత కాలంలో పిల్లలను తల్లితండ్రులు ఏ విధంగా పెంచుతున్నారు, అలానే తల్లితండ్రులు మరియు పిల్లల మధ్య చోటుచేసుకునే ఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. చేతన్ మద్దినేని, కాశిష్ వోరా జంటగా నటించిన ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ హెచ్.ఎన్. నరేష్ కుమార్ అందిస్తున్నారు.

ఇందులో రాజు పాత్రలో నటించిన చేతన్ కు తప్పకుండా మంచిపేరు వస్తుందని, కేవలం చదువుపైనే దృష్టిపెట్టి మిగతా విషయాలపై పెద్దగా అవగాహలేని అతడి పాత్ర ప్రేక్షకుల మనసులు గిలిగింతలు పెడుతుందని అంటున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మరియు ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని రేపు సాయంత్రం ఘనంగా జరుగనుంది. ఇంకా ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, నరేష్, ప్రియదర్శి, బ్రహ్మానందం, రావు రమేశ్ తదితరులు ఇతర పాఠాల్లో నటిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here