24 గంటల్లో అత్యధిక వ్యూస్ కొల్లగొట్టిన ప్రభాస్ ‘సాహో’ టీజర్….!!

0
27

టాలీవుడ్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని అందుకున్న బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న కొత్త చిత్రం ‘సాహో’. యువి క్రియేషన్స్ పతాకంపై దాదాపుగా రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ ను నిన్న యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర బృదం.

ఇక విడుదల చేయడమే ఆలస్యం, ఆ టీజర్ ఇప్పటివరకు విపరీతమైన వ్యూస్ మరియు ప్రేక్షాభిమానంతో దూసుకెళుతోంది. ఇకపోతే తమ సాహో చిత్ర టీజర్ గడిచిన 24 గంటల్లో, మొత్తం అన్ని భాషల్లో కలిపి 60 మిలియన్లకు పైగా వ్యూస్ ను సంపాదించిందని యువి క్రియేషన్స్ వారు కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే టీజర్ తోనే ఈ స్థాయిలో వీక్షకులు మరియు ఫ్యాన్స్ లో ఇంత క్రేజ్ గడించిన సాహో, రేపు విడుదల తరువాత ఇంకెన్ని రికార్డులు కొల్లగొడతాడో వేచి చూడాలి….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here