నేడు మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ రెండవ కుమారుడు….!!

0
25

ఇటీవల వరుస విజయాలతో దూసుకెళ్తున్న టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టి స్టారర్ ఆర్ఆర్ఆర్ లో అయన ఒక హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల గ్యాప్ తరువాత ఇటీవల పునఃప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే నేడు ఎన్టీఆర్ రెండవ కుమారుడు భార్గవ్ రామ్ మొదటి పుట్టినరోజు. ఇక ఈ వేడుకను పురస్కరించుకుని కాసేపటి క్రితం ఎన్టీఆర్ తన రెండవ కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ తన ఇద్దరు కుమారుల ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసారు.

వాస్తవానికి ఎప్పటికపుడు సినిమా సంగతులతో పాటు తన వ్యక్తిగత విషయాలు కూడా మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ పెట్టిన పోస్ట్ ను రీట్వీట్ చేస్తూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా భార్గవ్ రామ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు పలువురు నందమూరి అభిమానులు. కాగా ఎన్టీఆర్ పోస్ట్ చేసిన అయన కుమారుల ఫోటోలు ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో  వైరల్ అవుతున్నాయి….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here