అద్భుతమైన గాత్రంతో అంతే ఆకట్టునే నటుడైన సీనియర్ నటులు సాయి కుమార్ గారి తనయుడు ఆది నటిస్తున్న కొత్త సినిమా బుర్రకథ. శమంతకమణి, నెక్స్ట్ నువ్వే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటున్నారు . ఇక ప్రస్తుతం అయన నటిస్తున్న ఈ బుర్రకథ సినిమాలో ఒక వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
ఇక ఇందులో హీరో పాత్ర రెండు విధాలుగా పనిచేసే మెదడు, అంటే మల్టిపుల్ పర్సనాలిటీ కండిషన్ అనే ప్రాబ్లమ్ ఉంటుందట. ఇకపోతే సినిమా ఆద్యంతం మంచి ఎంటెర్టైన్మెంట్ తో సాగుతూ థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడికి మంచి వినోదాన్ని పంచుతుందని అంటోంది చిత్ర యూనిట్. దీపాల ఆర్ట్స్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాలో ఆది సరసన మిస్తి చక్రబర్తి, నైరా షా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృదం చూస్తోంది….!!