ప్రముఖ కథానాయిక ‘తాప్సి’ ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’ పేరుతో ప్రముఖ తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్థూడియోస్’ నిర్మిస్తున్న చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ ను పొందింది. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 14 న విడుదల అవుతోందని చిత్ర నిర్మాత లు ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర తెలిపారు.గతంలో ఈ సంస్థ సిద్ధార్ధ్’ కథానాయకునిగా రూపొందిన ‘లవ్ ఫెయిల్యూర్’ (2012), విక్టరీ ‘వెంకటేష్’ కథానాయకునిగా రూపొందిన ‘గురు’ (2017) వంటి ఘన విజయం సాధించిన చిత్రాలను నిర్మించిన విషయం విదితమే. ఇప్పుడు తమ మరో ప్రయత్నం గా తాప్సి’ ప్రధాన పాత్రలో ఈ ‘గేమ్ ఓవర్’ ను నిర్మించటం సంతోషంగా ఉందని అన్నారు నిర్మాత ఎస్.శశికాంత్. ఓ సరికొత్త కధ, కథనాలతో తెలుగు,తమిళ భాషలలో రూపొందిన ఈ చిత్రం తమ గత చిత్రాలు ‘లవ్ ఫెయిల్యూర్’, ‘గురు’, విజయాల సరసన ఈ చిత్రం కూడా నిలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.‘నయనతార’ కథానాయికగా తమిళ నాట ఘనవిజయం సాధించిన ‘మయూరి’ వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ‘అశ్విన్ శరవణన్’ దర్శకత్వంలో ఈ ‘గేమ్ ఓవర్’ చిత్రం రూపొందింది.
కథానాయిక ‘తాప్సి’ మాట్లాడుతూ..’గేమ్ ఓవర్’ చిత్రం కధ విన్నప్పుడే సరికొత్తగా ఉందని అనిపించింది. విజయం సాధించే చిత్రం అనిపించింది. ‘ఆనందో బ్రహ్మ’తరువాత నా చిత్రాలపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ చిత్రం వమ్ము చేయదని అన్నారు. దర్శకుడు ‘అశ్విన్ శరవణన్’ మాట్లాడుతూ… ‘గేమ్ ఓవర్’ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని అన్నారు.
ఈ ‘గేమ్ ఓవర్’ చిత్రానికి సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్ , ఎడిటర్: రిచర్డ్ కెవిన్, రచన: అశ్విన్ శరవణన్,కావ్య రాంకుమార్, మాటలు: వెంకట్ కాచర్ల, ఛాయా గ్రహణం: ఎ.వసంత్, ఆర్ట్: శివశంకర్ , కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.కె.నందిని, పోరాటాలు: ‘రియల్’ సతీష్, సౌండ్ డిజైనర్: సచిన్ సుధాకరన్, హరిహరన్ (సింక్ సినిమా), స్టిల్స్: ఎమ్.ఎస్.ఆనందం, పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న, పి.ఆర్.ఓ. లక్ష్మి వేణుగోపాల్, వై నాట్ స్టూడియోస్ టీమ్: కంటెంట్ హెడ్: సుమన్ కుమార్, డిస్ట్రిబ్యూషన్ హెడ్: కిషోర్ తాళ్లూరు, బిజినెస్ ఆపరేషన్స్: ప్రణవ్ రాజ్ కుమార్.
ప్రొడక్షన్ ఎగ్జిక్యుటివ్స్: రంగరాజ్, ప్రసాద్ సోములరెడ్డి. లైన్ ప్రొడ్యూసర్: ముత్తురామలింగం
సహ నిర్మాత: చక్రవర్తి రామచంద్ర
నిర్మాత: ఎస్.శశికాంత్
దర్శకత్వం: అశ్విన్ శరవణన్