సీత ఒక ట్రెండ్ సెట్టింగ్ స్టోరీ – బెల్లంకొండ సాయి శ్రీనివాస్

0
549

టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ ,కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగాఏ కె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘సీత‘. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం మే 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంటర్వ్యూ.

క్లైమాక్స్ చూసి అందరూ కచ్చితంగా ఎమోషనల్ అవుతారు అని అన్నారు?
– అవునండి ! సినిమా చాలా బాగా వ‌చ్చింది. అందులో చివ‌రి అర‌గంట విప‌రీతంగా ఎమోష‌నల్‌గా ఉంటుంది. అందుకే ఆ స్టేట్ మెంట్ ఇచ్చాను.అలాగే సినిమా అవుట్ ఫుట్ పట్ల చాలా హ్యాపీ గా ఉన్నాం.

అస‌లు సీత క‌థ మీరు ఒప్పుకోవడానికి కారణం?
– ముందుగా ఈ సినిమాలో చాలా వేరియేష‌న్లు ఉంటాయి. ఆడియన్స్ కి ఈ జానర్ కొత్త‌గా ఉంటుంది. ముందుగా తేజ‌గారు నాకు నాన్న గారికి రెండు క‌థ‌లు చెప్పారు. నాకు ఈ క‌థ న‌చ్చింది. మా నాన్న‌గారికి మ‌రో క‌థ న‌చ్చింది. నటుడిగా న‌న్ను నేను ప్రూవ్ చేసుకోవ‌డానికి ఈ క‌థ నాకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నా న‌మ్మ‌కం. నా తొలి సినిమా అల్లుడు శ్రీను లో కాస్త కామెడీ చేశాను. ఆ త‌ర్వాత ఇప్ప‌టిదాకా కామెడీ చేయ‌లేదు అందుకే ఈ కథ ఒప్పుకున్నాను..

మీ క్యారెక్టర్ గురించి?
– ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు రఘరాం. 20 ఏళ్లు జ‌నాల‌కు దూరంగా, పొల్యూట్ కాకుండా పెరిగిన ఓ అబ్బాయి ఈ జ‌నార‌ణ్యంలోకి వ‌స్తే ఎలా ఉంటుంది? అందులోనూ డ‌బ్బే స‌ర్వ‌స్వం అనుకునే అమ్మాయికి, నిలిచి నిదానంగా ఉండ‌టం మేల‌నుకునే అబ్బాయికి ప‌రిచ‌యం ఏంటి? అది ఏ తీరాల‌కు దారి తీసింద‌నేది ఈ క‌థ‌లో కీల‌కం.

తేజ‌తో ప‌నిచేయ‌డం ఎలా ఉంది?
– చాలా స్వీట్‌గా ఉంది. ఆయ‌న మంచి ఇన్‌పుట్స్ ఇస్తారు. అలా చేయి.. ఇలా చేయి.. అని చెప్ప‌రు. ఎలా చేస్తే బావుంటుందో ఆలోచించుకోమ‌ని చెబుతారు. అలాగే ఆయన చాలా నిజాయితీ గల మనిషి. సినిమా తప్ప వేరే ప్రపంచం తెలీదు. నటన పరంగా ఆయన ఇచ్చిన ఇన్ పుట్స్ నాకు తరువాతి సినిమాలకు కూడా ఉపయోగపడతాయి. చిత్రీకరణ మొదటి రోజు జరిగిన సంఘటన నాకు ఇప్పటికి స్పష్టంగా గుర్తుంది. తేజ గారు నాకొక పెద్ద డైలాగ్ ఉన్న పేపర్ చేతిలో పెట్టి రెడీ అవ్వు అనడంతో , ఏమిటీ ఈయన మొదటి రోజే నాకు ఇంత పెద్ద పరీక్ష పెట్టేశారు అని షాక్ కి గురయ్యాను. నా వ్యాన్ లోకి వెళ్ళి కొంత సేపు ప్రిపేరై వచ్చి సింగల్ టేక్ లో చేశాను, దానితో షాక్ తిన్న తేజ గారు నన్ను మెచ్చుకోవడంతో చాలా ఆనందం వేసింది.

కాజ‌ల్ అగర్వాల్ తో రెండో సారి కలిసి నటిస్తున్నారు కదా ?
– అవును కాజల్ తో ఇదినా రెండో సినిమా. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా సీరియ‌స్‌గా ఉంటుంది. అలాంటి పాత్ర ఆమె మాత్రమే చేయగలదు అనుకునేలా ఆమె క్యారెక్టర్ ఉంటుంది. తేజ‌గారు నాకు ఈ క‌థ చెప్పేట‌ప్పుడే హీరోయిన్‌గా కాజ‌ల్ ఫిక్స‌యి ఉన్నారు.పెర్పామెన్స్ కి మంచి స్కోప్ ఉన్న ఈ మూవీకి కాజల్ పర్ఫెక్ట్ హీరొయిన్ .

హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న మూవీలో నటించడం కొంచెం ఇబ్బందిగా అనిపించలేదా?
-నాకు మంచి నటుడిగా నిరూపించుకోవాలని ఉంది, కాబట్టి హీరోయిన్ పాత్ర పేరు టైటిల్ గా గల మూవీలో నటించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాది మంచి పాత్ర అని నాకు పూర్తి నమ్మకం ఉంది. షూటింగ్ జరిగినన్నాళ్లు ఏనాడూ నేను ఇది కాజల్ కి ప్రాధాన్యం ఉన్న సినిమా అని ఫీల్ కాలేదు.

సీత టైటిల్ మీరే స‌జెస్ట్ చేశార‌ని..
– అవునండీ. ఈ సినిమాకు, ఈ టైటిలే క‌రెక్ట్. లేడీ ఓరియంటెడ్‌గా టైటిల్ పెట్టాలంటే చాలా మంది ఒప్పుకోర‌ట‌. నేను ఒప్పుకున్నందుకు ఆనందంగా ఉంద‌ని కొంద‌రు లేడీ జర్నలిస్ట్ లు నాకు ఫోన్ చేసి అభినందించారు.

లొకేషన్స్ చాలా కొత్తగా కనిపిస్తున్నాయి?

– ఈ సినిమాలో ఆడియన్స్ థ్రిల్ ఫీలయ్యే లొకేషన్స్ చాలా ఉంటాయి. ఇంతవరకూ ఏ తెలుగు సినిమా కూడా షూట్ చెయ్యని కాంబోడియాలోని అద్భుతమైన లొకేషన్స్ లో ఈ సినిమా చిత్రీకరించాం. అలాగే సినిమాలో పాత్ర‌ల చిత్రీక‌ర‌ణ‌, లొకేష‌న్లు, క‌థ‌, క‌థ‌నం.. ఒక‌టేంటి చాలానే ఉంటాయి. అందులో ఓఓ అని వెరైటీ శ్లాంగ్‌లో నేను చెప్పే ఊత‌ప‌దం ఒక‌టి. దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సోనూసూద్‌గారి గురించి చెప్పండి?
– సోనూసూద్ ఇప్పుడు నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. మా సంస్థ‌లో గ‌తంలో ఆయ‌న కందిరీగ చేశారు. అప్పుడే నాకు ఆయ‌న‌తో మంచి ప‌రిచ‌యం ఉంది. కానీ ఈ సినిమాతో క్లోజ్ అయ్యారు. జ‌న‌ర‌ల్‌గా ఇండ‌స్ట్రీలో మ‌న‌కు పెద్ద‌గా ఫ్రెండ్స్ ఉండ‌రు. కానీ సోనూసూద్‌గారు నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు.

మీరు నెక్స్ట్ చేస్తున్న సినిమాలేంటి?
– రాక్ష‌సుడు చేస్తున్నా. పూర్తి కావ‌చ్చింది. నాకు హిందీలో మంచి మార్కెట్ ఉంది. హిందీలో నా సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది.. భ‌గ‌వంతుడు హిందీ మార్కెట్‌ను క్రియేట్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. అక్కడ కూడా అందుకే హిందీ కోసం కాస్త స్పెష‌ల్‌గా కొన్నిటిని చేస్తున్నాం. తెలుగులో ఇంకా ఏవీ అంగీక‌రించ‌లేదు. అంగీక‌రించ‌గానే చెబుతా. `రాక్ష‌సుడు` మాత్రం జులైలో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాం.

ఈ సినిమాను మీ నాన్న చూశారా?
– ఆయ‌న‌కు ఈ సినిమా స‌ర్‌ప్రైజ్ ప్యాక్‌. మా అమ్మ‌, త‌మ్ముడు చూశారు. చాలా బాగా క‌నెక్ట్ అయి ఏడ్చేశారు. రేపు ఆడియన్స్ కూడా తప్పకుండా కనెక్ట్ అవుతారనే అనుకుంటున్నాను. అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here