మహేష్ బాబు అంటే టాలీవుడ్ సూపర్ స్టార్.. అంతేనా.. అమ్మాయిల రాకూమారుడు.. ఇంకా చెప్పాలంటే అభిమానుల ఆరాధ్యదైవం. అలాంటి హీరో తెరమీద కనిపిస్తే చాలు బాక్సాఫీస్ రికార్డులు బద్దలైపోతాయి. సినిమాలో కంటెంట్ ఉండాలే కానీ బ్లాక్ బస్టర్స్ ఖాయం.. టాలీవుడ్ నంబర్ 1 హీరో రేసులో మహేష్ ప్రస్తుతం ముందున్నారు.

కరెక్ట్ సినిమా పడితే అభిమానుల ఆదరణ ఎలా ఉంటుందో మహేష్ బాబుకు తాజాగా తెలిసివచ్చింది. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ‘మహర్షి’ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. ఇప్పటికే 100 కోట్ల సాధించింది. విద్యా, పట్టుదల , రైతుల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. కరెక్ట్ టైంలో కరెక్ట్ కాన్సెప్ట్ తో అదీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రావడంతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..

మహర్షి సినిమా సూపర్ హిట్ కావడంతో మహేష్ బాబులో ఆనందం మామూలుగా లేదు.. సాధారణంగా ప్రతీ సినిమా హిట్ కాగానే మహేష్ ఆ ఆనందాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి కుటుంబంతో కలిసి విదేశాలకు వెళుతుంటారు. కానీ ఈసారి మాత్రం తన సెలెబ్రేషన్స్ అభిమానులు, ప్రజలతోనే జరుపుకుంటుండడం విశేషం.

ఇప్పటికే మహర్షి లోని కాన్సెప్ట్ ను పంచేందుకు రైతులు, విద్యార్థులతో మహేష్ విడివిడిగా మాట్లాడారు. వారి బాగోగులు తెలుసుకున్నారు. రైతుల కష్టాలను చాలా దగ్గర నుంచి తెలుసుకొని వారి కష్టానికి ఫిదా అయ్యారు. ఇక విద్యార్థులతోనూ మమేకమై ఊసులు పంచుకున్నారు. ఇక తొలిసారి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని అక్కడ సక్సెస్ మీట్ లో అభిమానులను ఉత్తేజపరిచాడు. అంతకుముందు సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లోకి వెళ్లి అభిమానులను ఉత్తేజపరిచాడు. ఇలా మహర్షి సక్సెస్ తో మహేష్ బాబు జనంలోకి రావడం.. అభిమానులతో మీట్ కావడం ఆయన ఫ్యాన్స్ కు పండుగ వాతావరణాన్ని తెచ్చింది.