విజయ్ ఆంటోనీ, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో న‌టించిన తాజా తమిళ చిత్రం ‘కొలైగార‌న్’. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా క‌థానాయిక‌. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. మర్డర్‌ మిస్టరీ, క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా జూన్ తొలి వారంలో సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజ‌ర్, పాటలు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా ఈ చిత్రం ట్రైలర్ ని నేడు రిలీజ్ చేశారు నిర్మాతలు..

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ , హీరో విజయ్ ఆంటోనీ లు పోటాపోటీగా నటించారు.. ఈ చిత్ర కథ ఎంతో ఆసక్తిగా ఉన్నందువల్లే ఈ సినిమా ని తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధాయమయ్యాం.. ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లర్ అంశాలు అన్ని ఇందులో ఉన్నాయి.. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. అన్ని వ‌ర్గాల్ని మెప్పించే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్న చిత్రమిది. అర్జున్ న‌ట‌న సినిమాకే హైలైట్..అన్నారు.. సైమన్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు..

నటీనటులు : అర్జున్, విజయ్ ఆంటోనీ, ఆశిమా నార్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రాజ్

సాంకేతిక నిపుణులు :
రచయిత & దర్శకుడు: ఆండ్రూ లూయిస్
నిర్మాతలు: టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్
బ్యానర్: పారిజాత మూవీ క్రియేషన్స్‌
సంగీతం: సైమన్ కే కింగ్
సాహిత్యం మరియు సంభాషణలు: భాష శ్రీ
సినిమాటోగ్రఫీ: మాక్స్
ఎడిటర్: రిచర్డ్ కెవిన్
ఆర్ట్ : వినోద్ రాజ్ కుమార్
పి.ఆర్.ఓ: సాయి సతీష్