రెండు పడవల ప్రయాణం.. ఈ కమెడియన్ విజయం

0
468

కమెడియన్ కం హీరో శ్రీనివాస్ రెడ్డికి టాలీవుడ్ లో ఎప్పుడూ అవకాశాలు తెరిచే ఉంటాయి. ఓ వైపు మంచి కథ దొరికితే హీరోగా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా రాణిస్తున్నాడు. జయంబు నిశ్చయింబు సినిమాలో సిన్సియర్ లవర్ గా హీరో పాత్ర చేసి, ఆనందో బ్రహ్మ సినిమాలో హర్రర్ ను కామెడీగా చూపించి విజయం సాధించారు. శ్రీనివాస్ రెడ్డి ఇటు హీరోగా.. అటు కమెడియన్ గా రెండు పాత్రలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి గుర్తింపును సాధించుకున్నారు.

సినిమా రంగంలో రెండు పడవలపై అడుగులు వేసి రాణించిన వారు అరుదు. శ్రీనివాస్ రెడ్డి ఇమేజ్ చట్రంలో చిక్కుకుపోకుండా కమెడియన్ గా, హీరోగా రెండు పాత్రల్లోనూ నటిస్తున్నాడు. కమెడియన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసరెడ్డి ఆమధ్య వచ్చిన ‘గీతాంజలి’ సినిమాతో హీరోగా మారి తొలి హిట్ అందుకున్నాడు. మళ్లీ తనదైన శైలిలో కమెడియన్ గా వచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకుంటున్నాడు. త్రివిక్రమ్ ‘అఆ’ మూవీలో బాగా ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత వచ్చి ప్రేమమ్, జయంబు నిశ్చయింబు రా, జంబలకిడిపంబ..‘ఆనందో బ్రహ్మ’ సినిమాతో గ్రాండ్ హిట్ కొట్టి టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశాడు.

శ్రీనివాసరెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా కేంద్రం. ఇతడు 1973 ఫిబ్రవరి 23న ఓ రైతు కుటుంబంలో పుట్టి పెరిగాడు. శ్రీనివాసరెడ్డి నాన్న వ్యవసాయం చేస్తూ ఇతడిని చదివించాడు. . డిగ్రీ ఖమ్మంలోనే చదివిన ఇతడు సినిమాలపై పిచ్చి ప్రేమతో హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత చాలా రోజులు ప్రయత్నించిన తర్వాత 2001లో కొత్త హీరోతో వచ్చిన ‘ఇష్టం’ మూవీతో టాలీవుడ్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇడియట్, డార్లింగ్ మూవీలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుసగా రవితేజ, అల్లు అర్జున్ సహా టాలీవుడ్ అగ్రహీరోలందరితో కలిసి నటించి టాలీవుడ్ లో కమెడియన్ గుర్తింపు పొందాడు.

ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. కమెడియన్ పాత్రలు ఒదులుకోనని శ్రీనివాసరెడ్డి చెబుతున్నాడు. ఇలా టాలీవుడ్ లో ట్రెండ్ మారినా.. అవకాశాలు కోల్పోకుండా నిలదొక్కుకున్న కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here