‘మహర్షి’లో స్టూడెంట్ మహేష్.. అసలు ఎక్కడ చదివారు?

0
529

సూపర్ స్టార్  మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా కోసం గడ్డం పెంచి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. స్టూడెంట్ పాత్రలో మహేష్ గడ్డం అందరినీ ఆకట్టుకుంది. ఇదో కొత్త లుక్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వినీదత్-దిల్ రాజు-పీవీపీ నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కు రెడీ అయ్యింది.. అయితే ఇందులో మాస్ స్టూడెంట్ క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో తొలిసారి భారీ గడ్డం పెంచాడు మహేష్ బాబు. ఆ కొత్త లుక్ ఫొటోలు విడుదలైనప్పుడు  అందరూ మెస్మరైజ్ అయ్యారు..

అదలా ఉంచితే.. మహేష్ బాబు తెలుగుతో పాటు తమిళంలో కూడా బాగా మాట్లాడగలరు. గత స్పైడర్ చిత్రాన్ని తమిళంలో రిలీజ్ చేసినప్పుడు సొంతంగా తన పాత్రకు తమిళంలో డబ్బింగ్ కూడా చెప్పారు. నిజానికి మహేష్ బాబుకు తెలుగుతో పాటు తమిళం కూడా బాగా వచ్చు. ఎందుకంటే ఆయన పుట్టింది పెరిగింది అంతా తమిళనాడు రాజధాని చెన్నైలోనే.. ఆయన అక్కడే చదువుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కు రాకముందు చెన్నైలోనే వీరి ఫ్యామిలీ ఉండేది. సూపర్ స్టార్ కృష్ణ అక్కడే నివాసముండి సినిమాలు తీసేవారు. కృష్ణతో పాటు ఆయన భార్య, పిల్లలు ఉండడంతో మహేష్ బాల్యమంతా చైన్నైలోనే సాగింది.

మహేష్ బాబు ఆగస్టు 9, 1974న సూపర్ స్టార్ కృష్ణ, శ్రీమతి ఇందిరాదేవి దంపతులకు మద్రాసులో జన్మించారు. మద్రాసులోనే మహేష్ చదువు పూర్తయ్యింది. పదోతరగతి వరకు చెన్నైలోని సెయింట్ బెడె స్కూల్ లో చదివారు. అక్కడ లయోలా కాలేజీలో కామర్స్ లో ఇంటర్ , డిగ్రీ పూర్తిచేశారు. చిన్నతనంలోనే నటనలో ఓనమాలు దిద్దిన మహేష్ బాబు 5 ఏళ్ల వయసులోనే 1979తో రిలీజ్ అయిన ‘నీడ’ సినిమాతో తెలుగులో తెరంగ్రేట్రం చేశాడు. బాల్యనటుడిగా 7 చిత్రాలు చేశాడు. 1991లో బాలనటుడిగా వచ్చిన బాలచంద్రుడు మూవీ గ్రాండ్ హిట్ అయ్యింది. అప్పుడు డ్యాన్సులు, నటనలతో అలరించాడు. కానీ ఆ సమయంలో స్కూలు విద్య చదువుతున్న మహేష్ బాబు చదువులు డిస్ట్ర్రబ్ కావడంతో కృష్ణ గారు సినిమాలకు బ్రేక్ వేసి చదువులు పూర్తి చేయాలని పంపించేశారు. దీంతో ఆ తర్వాత మహేష్ బాబు సినిమాల్లో నటించలేదు.

ఆ తర్వాత చాలా ఏళ్లకు 1999లో ప్రిన్స్ మహేష్ బాబు రాజకుమారుడు మూవీతో తెలుగులో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడు.

మహేష్ విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే సాగడంతో ఆయన ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారు. కార్తి, సూర్య ,మహేష్ బాబు .. ఒకే స్కూల్లో చదివారు. హైదరాబాద్ వచ్చేశాక మహేష్ కు స్నేహితులు తగ్గిపోయారు. అందుకే ఎప్పుడూ చెన్నై వెళ్లిన తన చిన్ననాటి స్నేహితులను కలుసుకొని వారితో సరదాగా గడుపుతాడట.. అలా మహేష్ తండ్రి బాటలో నటుడిగా మారి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. అయితే చాలా రోజుల తర్వాత ‘మహర్షి’లో స్టూడెంట్ గా కనిపించబోతున్నాడు. మరి అసలైన చదువును మహేష్ ఎక్కడ చదివాడా అన్న ఆసక్తి ఉండడం సహజం.. అందుకే ఆరాతీస్తే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here