బుర్రకథ టీజర్.. రెండు బుర్రల ఆది హాస్యం

0
551

ఊహలకు రెక్కలొస్తే గాల్లో ఎగిరిపోతాం.. ఆదిత్య 369 సినిమాలో బాలయ్యబాబు ఎగిరిపోయినట్టు.. కథను కాల్పినికగా ఊహించుకోవచ్చు. వెండితెరపై ఏదైనా అద్భుతం చేయవచ్చు. ఇప్పుడు డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడు ఆది కూడా సృజనాత్మక కథతో మనముందుకు వస్తున్నారు. అదే ‘బుర్రకథ’..

బుర్రకథ అంటే తెలంగాణ, ఏపీలో చెప్పే ప్రాచీన వీధి నాటకం కాదు.. రెండు బుర్రలున్న ఆది తీసిన సినిమా కథ ఇదీ.. కొత్త కాన్సెప్ట్ తో సరికొత్తగా తీసిన ఈ సినిమా టీజర్ విడుదలైంది. అద్భుతంగా దర్శకుడు తెరకెక్కించాడని అర్థమవుతోంది. హాస్య చిత్రాల రచయితగా పేరున్న డైమండ్ రత్నబాబు తొలిసారి దర్శకుడిగా మారి విభిన్నమైన కథతో ఈ సినిమా తీశాడని అర్థమవుతోంది..

కథలో హీరో ఆదికి రెండు బుర్రలు ఉండడం ఈ కథలోని కొత్తదనం. ఒకటి అభిగా జాలీగా ప్రేమికుడిగా ప్రియురాలితో ఎంజాయ్ చేసే పాత్ర. రెండోది రామ్ పేరుతో మొత్తం భక్తి పారవశ్యంలో ఓలలాడే పాత్ర. అభి పాత్ర నవతరం యువకుడిలా ఉంటే.. రామ్ పాత్ర మాత్రం పూజలు, పునస్కారాలతో సంప్రదాయ బద్దంగా ఉంటుంది. దీనివల్ల తండ్రి పాత్రచేసిన రాజేంద్రప్రసాద్ ఇబ్బందులు పడేలాగా కామెడీ జనరేట్ చేసేలా ఈ ట్రైలర్ ను రూపొందించారు.

రెండు బుర్రలతో అభిరామ్ చేసిన పాత్ర ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ఈ రెండు పాత్రలను మంచి టైమింగ్ ఆది ఇరగ్గొట్టాడు. రాజేంద్రప్రసాద్, పోసానిల పాత్రలు నవ్వులు పూయించాయి. రోటీన్ కు భిన్నంగా తెరకెక్కిన ఈ మూవీ కాస్త భిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.

బుర్రకథ ట్రైలర్ ఇదే..
https://www.youtube.com/watch?v=aCjiKkt8zMs

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here