టాలీవుడ్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే సెన్షేషన్. అర్జున్ రెడ్డితో దూసుకొచ్చిన ఈ హీరో ఆ తర్వాత గీతాగోవిందంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు. యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న విజయ్ తాజాగా మహేష్ బాబు ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు గెస్ట్ గా వచ్చి అందరి మనసు చూరగొన్నాడు. తనదైన ‘రౌడీ’స్టాల్ యాటిట్యూడ్ తో అందరినీ మెస్మరైజ్ చేశాడు.
అయితే నిజానికి తెరపై ఇంత అద్భుతంగా నటిస్తున్న విజయ్ దేవరకొండ హీరో అవుదామని అస్సలు అనుకోలేదు. క్రికెటర్ కాబోయి యాక్టరయ్యాడు. ఈ విషయాన్ని ఆయనే ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ప్రాణంగా ప్రేమించే క్రికెట్ లో ఫ్యూచర్ లేదని గ్రహించి యాక్టర్ గా మారాడట..
విజయ్ దేవరకొండ కాలేజీ రోజుల్లో క్రికెట్ ను పిచ్చిగా ప్రేమించేవాడు.. తమ క్లాసులో 60మంది ఉంటే 40 మంది క్రికెట్ ఆడేవారే.. అందులో తాను ఒకడిని. అప్పుడు ఫాస్ట్ బౌలింగ్ బాగా వేసేవాడు.. అందరూ షోయబ్ అక్తర్ అనేవారు. కానీ ఓ సారి స్పీడ్ మిషన్ తీసుకొచ్చి పరీక్షిస్తే విజయ్ స్పీడు 90 కి.మీలే అని తేలింది. స్నిన్నర్ అనిల్ కుంబ్లే 100 కి.మీల వేగంతో బంతులేస్తాడని.. నీస్పీడు తక్కువే అని ఫ్రెండ్స అంతా హితబోధ చేశారు. దీంతో అప్పుడే ఇంత కాంపిటీషన్ లో తనకు క్రికెట్ ఫ్యూచర్ కాదని’ విజయ్ తెలుసుకున్నాడు.
100 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే 11 మంది క్రికెటర్లలో ఒకడిగా నిలబడడానికి మన శక్తిసామర్థ్యాలను సరిపోవని.. కామన్ సెన్స్ తో ఆలోచించి క్రికెట్ లో భవిష్యత్ లేదని భావించి సినిమా ఇండస్ట్రీవైపు విజయ్ అడుగులు వేశారు. ఇలా క్రికెటర్ అవ్వబోయి హీరో అయిన విజయ్ ఇప్పుడు టాలీవుడ్ లో అంచలంచెలుగా ఎదుగుతున్నారు. .