మహేష్ తో హాలీవుడ్ స్పై థ్రిల్లర్ తీయాలని ఉందంటున్న హాలీవుడ్ యాక్టర్, డైరెక్టర్ 

0
577

మహేష్ బాబు.. హాలీవుడ్ హీరోలా కనిపించే టాలీవుడ్ హీరో.. టక్కరిదొంగ సినిమా చూస్తే అదో హాలీవుడ్ సినిమాలాగానే కనిపిస్తోంది. అందులోని మహేష్ లుక్.. అచ్చం హాలీవుడ్ హీరోలను తలన్నేలానే ఉంటుంది. ఆ సినిమా గ్రాండ్ హిట్ కాకపోయినా కానీ మహేష్ బాబు మాత్రం ఇప్పటికీ హీరోల్లో హాలీవుడ్ లెవల్ అని అందరికీ అర్థమయ్యేలా చేసిన సినిమా అది.

ఇన్నాళ్లు తెలుగు సినిమా అంటే ఒక ప్రాంతీయ భాష చిత్రాలుగానే చూసేవారు. కానీ బాహుబలి మన స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈగ, మగధీర, రోబో సినిమాలు దక్షిణాది స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పాయి. ఇప్పుడు మన హీరోలు కూడా కేవలం తెలుగుకే పరిమితం కావడం లేదు. బాహుబలితో ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు. ఇలా టాలీవుడ్ ఇప్పుడు దేశవ్యాప్తం అయ్యింది.

కాగా టాలీవుడ్ ప్రభను ఇనుమడించేలా తాజాగా ఓ సంఘటన చోటు చేసుకుంది. ప్రిడేటర్, కమాండో లాంటి చిత్రాల్లో నటించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు బిల్ డ్యూక్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ లో మహేష్ బాబు గురించి ప్రస్తావించి కొనియాడారు. మహేష్ బాబుతో కలిసి ఒక ఇంటర్నేషనల్ స్పై సినిమాలో నటించాలని ఉందని.. దీనికోసం అమెరికా వచ్చినప్పుడు తన లంచ్ కు రావాలని డ్యూక్ ఆహ్వానించాడు. మహేష్ బాబు తోపాటు వంశీ పైడిపల్లి, ఏఆర్ మురగదాస్ గురించి ప్రస్తావించి లాస్ ఏంజిల్స్ వచ్చినప్పుడు మా ఆఫీసుకు రండి.. మనం కలిసి భోజనం చేస్తూ ఇంటర్నేషన్ స్పై సినిమా చేయడం పై చర్చిద్దాం అంటూ ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ హాలీవుడ్ రేంజ్ హీరో అని.. అతడితో నటించాలని ప్రపంచానికి తెలిసిన నటుడు ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here