నేచురల్‌స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘జెర్సీ’. ఈ చిత్రానికి మళ్ళీ రావా ఫేమ్ గౌతమ్ తిన్న నూరి దర్శకుడు. ఈ చిత్రం ఏప్రిల్ 19న వరల్డ్‌వైడ్‌గా విడుదలై ఎమోషనల్ సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ సాధిస్తూ దూసుకెళ్తుంది. సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్ లో ఏర్పాటు చేసిన థాంక్స్ మీట్ కి రాన దగ్గుబాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ ను మెమంటో లతో సత్కరించారు, ఈ సందర్భంగా..
విశ్వంత్ మాట్లాడుతూ – “సినిమా ఓ బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్. డైరెక్టర్ గౌతమ్ తొలి సినిమా నుండి పరిచయం. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు తను నవ్వుతున్నాడు. ఓ మంచి సినిమా చూసినప్పుడు చాలా శాటిస్పాక్షన్ కలుగుతుంది. అదే అలాంటి సినిమాలో పార్ట్ అయితే ఆ ఆనందం రెండు, మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాంటి అనుభూతిని ఇచ్చిన సినిమా ఇది“ అన్నారు.
పాటల రచయిత కృష్ణ కాంత్ మాట్లాడుతూ – “నన్ను నమ్మి నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన గౌతమ్‌కి వందసార్లు థాంక్స్ చెప్పినా సరిపోదు. అలాగే తమిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుధ్ ఈ సినిమాలో నాతో సింగిల్ కార్డ్ రాయించినందుకు తనకు కూడా థాంక్స్. ఓ మంచి సినిమాను.. మాస్టర్ పీస్‌లాంటి సినిమా కోసం పాటు పడ్డ నానిగారికి థాంక్స్. మంచి సినిమాను మిస్ కాకుండా చూడండి“ అన్నారు.
హీరోయిన్ శద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ – “ఈ రోజు ఏం చెప్పాలో తెలియడం లేదు. థాంక్యూ చెబితే సరిపోదు. ప్రేక్షకులు చూపించిన ప్రేమకు థాంక్స్. ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. సారా క్యారెక్టర్ చేయడం ఆనందంగా ఉంది. సింగిల్ ఫాదర్స్‌కు, సింగిల్ మదర్స్‌కు .. ఈ సినిమాను అంకితం చేస్తున్నాను“ అన్నారు.
http://industryhit.com/t/2019/04/shraddha-srinath-pics-7/
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ – “ఈ సినిమాను నాకు చేసే అవకాశం కల్పించిన నిర్మాతలు పిడివి.ప్రసాద్, సూర్యదేవర నాగవంశీగారికి, సినిమా కోసం వర్క్చేసిన ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నీషియన్‌కి థాంక్స్. నాని సార్‌కి స్పెషల్ థాంక్స్. శ్రద్ధాశ్రీనాథ్‌కి థాంక్స్. నా డైరెక్షన్ టీం ఎంతగానో సపోర్ట్ చేశారు. సినిమాను చూడని వాళ్లు ఎవరైనా ఉంటే.. చూడమని కోరుకుంటున్నాను“ అన్నారు.
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ – “ఈ సినిమా రిలీజ్ తర్వాత నాకు వచ్చిన మెసేజ్‌లు కానీ.. ఈ సినిమా యూనిట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్న విధానం కానీ.. ఇప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. రోజు రోజుకీ ఆదరణ పెరుగుతూనే ఉంది. సినిమాను ప్రేక్షకులు రిపీటెడ్‌గా చూస్తున్నారు. రానాకు ఈ సినిమా ఎంత నచ్చిందో నాకు తెలుసు. తను సినిమా చూసిన వెంటనే గంట సేపు మాట్లాడారు. అందుకే తను ఈ ఈవెంట్‌కు తను గెస్ట్‌గా వచ్చాడు. ఈ సినిమా మా యూనిట్ అందరికీ స్పెషల్‌గానే ఉండబోతోంది. మేం పాతబడిపోవచ్చు కానీ.. జెర్సీ పాతబడదు. స్పెషల్, ఫ్రౌడ్ ఫిలింగా మిగిలిపోతుంది. సినిమాపై అంత ప్రేమ, గౌరవాన్ని చూపించిన ప్రేక్షకులు, మీడియాకు థాంక్స్. సినిమాకు సపోర్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్‌కు థాంక్స్“ అన్నారు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ – “నాకు లైఫ్‌లో బేసిక్‌గా కొన్ని అర్థం కావు. క్రికెట్, పెళ్లి, అమ్మాయిలు, పిల్లలు అసలు అర్థం కారు. ఇవన్నీ అర్థం కానీ నాకే ఈ సినిమా చూసి ఏడుపొచ్చింది అంటే .. మిగిలిన ప్రేక్షకులు సినిమా చూసి ఎలా ఫీల్ అయ్యుంటారో అర్థం చేసుకోగలను. నాని ప్రతిరోజు నన్ను ఇన్స్పైర్ చేస్తుంటాడు. తనను చూసిన ప్రతిసారి సినిమాకు, తనకు ఉన్న ప్రేమే నన్ను ఇన్స్పైర్ చేస్తుంటుంది. గౌతమ్ స్టోరీ టెల్లర్గా.. ఫిలింమేకర్‌గా జెర్సీతో అందరినీ టచ్ చేశాడు. యు టర్న్ నుండి శ్రద్ధాశ్రీనాథ్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. సినిమా అనేది శాశ్వతం. ఎంటైర్ టీంకు ఇదొక మెరిట్‌లా మిగిలిపోతుంది“ అన్నారు.
http://industryhit.com/t/2019/04/jersey-thanks-meet-pics/


