నాని కాన్ఫిడెన్స్ చూసి చాలా సార్లు భయం వేసింది – దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి

0
8

తొలి చిత్రం మళ్ళిరావా తో సూపర్ సక్సెస్ అందుకొన్నారు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నేచురల్‌స్టార్‌ నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోహీరోయిన్లుగా పి.డి.వి.ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 19న వరల్డ్‌వైడ్‌గా విడుదలై సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ సాధిస్తూ దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి ఇంటర్వ్యూ .

`జెర్సీ` ఇన్‌స్పిరేష‌న్ ఎక్క‌డి నుండి వ‌చ్చింది?
– నిజానికి ముందు నేను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాల‌ని అనుకోలేదు. హైద‌రాబాద్‌లో ఓ ప్రెస్‌మీట్‌లో హ‌ర్ష బోగ్లే మాట్లాడుతూ స‌చిన్ టెండూల్క‌ర్ ఎంత గొప్పోడో ఆరోజు చెప్పారు. స‌చిన్ అంత గొప్ప ఆట‌గాళ్లు చాలా మంది ఉన్నా కూడా స‌చిన్ ఆయ‌న అట్యిట్యూడ్ కార‌ణంగానే స‌చిన్ గొప్ప‌వాడైయ్యాడ‌ని.. హర్ష బోగ్లే చెప్పుకొచ్చారు. నాకు స‌చిన్ టెండూల్క‌ర్ గొప్ప‌త‌నం క‌న్నా.. ఆయ‌న‌లా టాలెంట్ ఉన్నోళ్లు చాలా మంది ఉన్నారు క‌దా! అనే పాయింట్ బాగా న‌చ్చింది. సాధార‌ణంగా మ‌నం స‌క్సెస్ అయినోళ్ల‌నే గుర్తుపెట్టుకుంటాం. కానీ అంతే క‌ష్ట‌ప‌డి వేర్వేరు కార‌ణాల‌తో ల‌క్ష్యాన్ని చేరుకోని వాళ్లు చాలా మంది ఉంటారు. వాళ్ల క‌థ చెప్పాల‌నుకున్న సంద‌ర్భంలో జెర్సీ క‌థ‌ను త‌యారు చేసుకున్నాను.

క‌థ ప‌రంగా ఎలాంటి రీసెర్చ్ చేశారు?
– రీసెర్చ్ అంటూ ప్ర‌త్యేకంగా ఏమీ చేయ‌లేదు. చిన్న‌ప్ప‌ట్నుంచి క్రికెట్ ఆడుతున్నాం క‌దా.. దాన్ని దృష్టిలో పెట్టుకునే క‌థ‌ను రాసుకున్నాను. క‌థ‌పై ఎక్కువ రోజులు వ‌ర్క్ చేశాను. నా తొలి చిత్రం `మ‌ళ్ళీరావా` కంటే ముందు నుండే నా ద‌గ్గ‌రున్న స్టోరి.

సినిమాకు ఇంత పెద్ద రెస్పాన్స్ వ‌స్తుంద‌నుకున్నారా?
– లేదండి.. ఇంత మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని అనుకోలేదు. ఎందుకంటే సినిమా అంటే ఓ బాధ్య‌త‌. ముఖ్యంగా ద‌ర్శ‌కుడ్ని న‌మ్మే నిర్మాత డ‌బ్బులు పెడ‌తాడు. మొన్న‌టి వ‌ర‌కు నాకు కూడా అరే ఇంత మంది నన్ను న‌మ్మారే ఏమ‌వుతుందో ఏమో అనే టెన్ష‌న్ ఉండేది. ఇప్పుడు సినిమాకు హిట్ టాక్ వ‌చ్చి అంద‌ర‌రూ ఎంజాయ్ చేస్తున్నా స‌రే! నేను ఎంజాయ్ చేయ‌డానికి నాకు ఇంకా స‌మ‌యం ప‌ట్టేలానే ఉంది.

కథ రాసుకున్న తరువాత ముందు నాని నే అప్ప్రోచ్ అయ్యారా?
– నా ద‌గ్గ‌రున్న స్క్రిప్ట్స్‌లో నాకు ఇదే ఇష్ట‌మైన స్క్రిప్ట్‌. క‌థ రాసుకున్న త‌ర్వాత రెండు, మూడేళ్లు నా ద‌గ్గ‌రే ఉంది. ఎవరిని అప్రోచ్ కాలేదు. మళ్ళీరావ కన్నా ముందు చేద్దాం అనుకున్న కానీ నన్ను నేను ప్రూవ్ చేసుకున్న తరువాత ఈ కథ చేద్దాం అని ముందు మళ్ళీ రావా చేశాను.

ఈ చిత్రం ద్వారా ఏం చెప్పాల‌నుకున్నారు?
– ఓ అండ‌ర్‌డాగ్ స్టోరి. ప్ర‌పంచ‌మంతా ఇత‌నేం చేయ‌లేడు అని అంద‌రూ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన ఓ వ్య‌క్తి..
తన ఏజ్ అయిపోయిన తరువాత కూడా తన లక్ష్యం ఎలాంటి ప్ర‌య‌త్నం చేశాడు? దాన్ని సాధించ‌డానికి అత‌ను ఎంత వ‌ర‌కు ముందుకెళ్లాడ‌నేదే క‌థ‌.

నాని కాన్ఫిడెన్స్ లెవ‌ల్ ఎలా ఉండేది?
– నానిగారి కాన్ఫిడెన్స్ చూసి చాలా సంద‌ర్భాల్లో భ‌య‌మేసింది. ఎందుకంటే నేను ఓ మంచి సినిమా చేయాల‌నే త‌ప‌న‌తో ఈ సినిమా చేస్తూ వ‌చ్చాను. ఔట్‌పుట్‌ను డ‌బ్బింగ్ థియేట‌ర్‌లో చూసుకున్న త‌ర్వాత ఇది మ‌నం చేసిన సినిమాయేనా అనిపించింది. అంత న్యాచురల్ గా నాని నటించాడు.

క్రికెట్ ని సినిమాటిక్ గా కాకుండా చాలా ఆతెంటిక్ గా చూపించారు?
– నాని, విశ్వాంత్ త‌ప్ప‌.. ఈ సినిమాలో మిగిలిన వాళ్లంద‌రూ క్రికెట‌ర్సే. క్రికెట‌ర్స్ అంద‌రికీ యాక్టింగ్‌లో కొన్ని రోజులు శిక్ష‌ణ ఇచ్చాం. స్పోర్ట్స్‌ను అథేంటిక్‌గా చూపించాలి. క్రికెట్ స‌న్నివేశాల‌ను షూ్ చేయ‌డం చాలా క‌ష్టమైంది. సాధార‌ణ సీన్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసేయొచ్చు. అదే క్రికెట్‌లో 1 మినిట్ ఏపిసోడ్‌ను ఒక‌టిన్నర రోజు షూట్ చేసిన సంద‌ర్భం కూడా ఉంది. ఒక కెమెరాతో మూమెంట్స్ క్యాప్చ‌ర్ చేయ‌డం క‌ష్టం. అందుక‌నే ఓ సైడ్ క్రికెట్ గేమ్‌ను కొన్ని రోజుల్లో చిత్రీక‌రించాం.. మ‌రో ప‌క్క స‌న్నివేశాల‌ను మ‌రికొన్ని రోజుల్లో చిత్రీక‌రించాం.

http://industryhit.com/t/2019/04/jersey-director-gowtham-tinnanuri-pics/

మీ అబ్బాయి మీరు కొనివ్వలేనిది ఏదయినా అడిగాడా?
– లేందండి! కానీ చాలా మంది జీవితాలలో జరిగే కామన్ ప్రాబ్లెమ్ ని చూపించడం జరిగింది.

హరీష్ కళ్యాణ్ కి కూడా నాని తోనే డబ్బింగ్ చెప్పించారు?
– దాని వెనుక పెద్ద రీజన్ అంటూ ఏమి లేదండి. ఫాథర్ సన్ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు అది కూడా రెండు గంటలు ఫాదర్ స్టోరీ చుసిన తరువాత అతని వాయిస్ తోనే డబ్బింగ్ చెప్పిస్తే ఆడియన్సు ఇంకా కనెక్ట్ అవుతారు అని చెప్పించడం జరిగింది.

రోనిత్ గురించి చెప్పండి?
– రోనిత్ ఢిల్లీ నుండి వచ్చాడు, చాలా ఎనర్జిటిక్. సెట్ లో ఎప్పుడు అల్లరి చేస్తూ ఉండేవాడు. సినిమా ఎక్కువభాగం నైట్ టైం లో షూట్ చెయ్యడం జరిగింది. అయినా ఎక్కడా ఆ ఫీల్ రానివ్వలేదు. ఎమోషనల్ సీన్లు కూడా అంత బాగా చేయగలుగుతాడని ముందు మేము అనుకోలేదు.

ఆనిరుధ్ మ్యూజిక్ సినిమాకు ఎంత వరకు ప్లస్ అయ్యింది?
– ఆనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వచ్చింది. కొన్ని ఎమోషనల్ స్కీన్లలో తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మ్యాజిక్ చేసాడనే చెప్పాలి.

ప్రొడ్యూసర్ గురించి?
– నాగ వంశీ చాలా డిసిప్లేన్ ప్రొడ్యూసర్. ఎప్పుడు సినిమా గురించే ఆలోచిస్తుంటారు. సినిమా బాగా రావడానికి పూర్తి సహకారం అందిస్తారు. ఈ సినిమాలో కూడా ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా ఎంత అవసరమో అంత ఖర్చుపెట్టి మా అందరి నుండి బెస్ట్ అవుట్ ఫుట్ ను రాబట్టుకున్నారు. తనతో కలిసి పనిచెయ్యడం చాలా హ్యాపీ.

బాలీవుడ్‌లో సినిమాలు చేసే ఆలోచన ?
– లేదండి ఇప్పట్లో అయితే అది కుదురదు. తెలుగులో నే ఇంకా మంచి సినిమాలు చేయాలి. ముందు క‌థ రాసుకున్న త‌ర్వాతే దానికి త‌గ్గ హీరోల‌ను క‌లిసి క‌థ చెబుతాను. ప్ర‌స్తుతం నా ద‌గ్గ‌ర కొన్ని క‌థ‌లున్నాయండీ. అయితే వెంట‌నే సినిమా స్టార్ట్ చేయ‌ను. కాస్త గ్యాప్ తీసుకుని సినిమా చేస్తాను.

నెక్స్‌ట్ ప్రాజెక్ట్స్‌
– ముందు క‌థ రాసుకున్న త‌ర్వాతే దానికి త‌గ్గ హీరోల‌ను క‌లిసి క‌థ చెబుతాను. ప్ర‌స్తుతం నా ద‌గ్గ‌ర కొన్ని క‌థ‌లున్నాయండీ.. అయితే వెంట‌నే సినిమా స్టార్ట్ చేయ‌ను. కాస్త గ్యాప్ తీసుకుని సినిమా చేస్తాను.అంటూ ఇంటర్వ్యూ ముగించారు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here