డివైన్‌ పాయింట్‌తో తెరకెక్కిన ‘వజ్రకవచధర’ లో ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు మంచి ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంటుంది – హీరో సప్తగిరి

0
6

స్టార్‌ కమెడియన్‌ సప్తగిరి హీరోగా అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో బేబీ శస్త్ర సమర్పణలో శివ శివమ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘వజ్ర కవచరధర గోవింద’.  హైదరాబాద్‌ ప్రసాద్‌లాబ్స్‌లో ఈ చిత్ర టీం ప్రెస్ మీట్ నిర్వహించారు . ఈ సందర్భంగా…

హీరో సప్తగిరి మాట్లాడుతూ – ”సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’, ‘సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’ తరువాత నన్ను నేను కొత్తగా ఎలా చూపించుకోగలను అని ఎదురుచూస్తున్న సమయంలో అరుణ్‌ పవార్‌ ఈ కాన్సెప్ట్‌ గురించి చెప్పడం జరిగింది. ఈ సినిమా మెయిన్‌ పాయింట్‌ వచ్చేసి ‘లక్ష్యం గొప్పది అయినా వెళ్లే మార్గం మంచిది అయితేనే ఆ దేవుడి సహకారం ఉంటుంది’.. అనే ఒక డివైన్‌ పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నేను హీరోగా కాకుండా మంచి కమెడియన్‌గా ఎంటర్‌టైన్‌ చేస్తాను. సెకండ్‌ హాఫ్‌లో కమెడియన్స్‌తో వచ్చే సీన్లు యూట్యూబ్‌లో తప్పకుండా ట్రెండింగ్‌లో ఉంటాయి. అలాగే మంచి ఎమోషనల్‌ కంటెంట్‌ కూడా ఉంది. మా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు దాదాపు 80% అయిపోయాయి. సినిమాను మేలో విడుదల చేయడానికి మా నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ సినిమా రా ఫుటేజ్‌ చూసి మా సినిమా విడుదల హక్కుల్ని కొన్న డిస్ట్రిబ్యూటర్‌ బ్రహ్మయ్యగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సినిమా అందరికీ మంచి లాభాలు తెస్తుంది” అన్నారు.

చిత్ర దర్శకుడు అరుణ్‌ పవార్‌ మాట్లాడుతూ – ”సప్తగిరి హీరోగా నా దర్శకత్వంలో వచ్చిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు విజయయాత్ర కూడా చేశాం. అలానే అప్పుడు డీమానిటైజేషన్‌ ఉన్నా కూడా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్‌ అందరూ మంచి లాభాలు సాధించారు. అంతకంటే మంచి పేరు, డబ్బులు రావాలని కసితో ‘వజ్ర కవచధర గోవింద’ రూపొందించాం. అంతకు మించి సక్సెస్‌ కావాలనే తపనతో దానికోసం క షి చేసాం. సినిమా చాలా బాగా వచ్చింది. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో, ఆ అంశాలన్నీ మా సినిమాలో ఉంటాయి. సప్తగిరి వ్యావహారిక శైలికి పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే కథ ఇది. మా కథకు అనుగుణంగానే పవర్‌ఫుల్‌గా ‘వజ్ర కవచధర గోవింద’ అనే టైటిల్‌ పెట్టాం. వజ్రం కోసం సప్తగిరి ఎలా కవచంలా నిలబడ్డాడు అనేది కథ. నిర్మాతలు కొత్తవారైనా ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమా రూపొందిచారు. కడుపుబ్బా నవ్వించే అంశాలతోపాటు, మంచి యాక్షన్‌, ఎమోషన్‌, ఇతర వాణిజ్య అంశాలు మెండుగా ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను మేలో విడుదల చేస్తాము” అన్నారు.

నిర్మాత జీవీఎన్‌ రెడ్డి మాట్లాడుతూ – ”మా బ్యానర్‌లో ఫస్ట్‌ సినిమా. టీం అందరం ప్రాణం పెట్టి చేసాం. ఎంతో ఇష్టంతో చాలా కష్టపడి పనిచేశాం. మా చిత్ర టైటిల్‌, టీజర్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వచ్చింది. టైటిల్‌ ప్రకటించగానే మా సినిమాపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అటెన్షన్‌ బాగా పెరిగింది. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత సప్తగిరి, అరుణ్‌ పవార్‌ కాంబినేషన్‌లో సినిమా చేసే అవకాశం మా బ్యానర్‌కి దక్కడం చాలా హ్యాపీగా ఉంది. అరుణ్‌ పవార్‌ గారు ఈ సినిమాను హిలేరియస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అన్ని కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కించారు. నరేంద్ర అన్నగారు ఈ సినిమాకు ఎంతో సహకారం అందించారు. అలాగే మా సినిమా టీజర్‌ చూసి ముందుకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ బ్రహ్మయ్యగారికి నా క తజ్ఞతలు. సినిమా అందరికి మంచి లాభాలు తెచ్చి పెడుతుందనే నమ్మకం ఉంది” అన్నారు.

నటుడు రాఘవ మాట్లాడుతూ – ”గతంలో నేను, సప్తగిరి కలిసి మంచి సినిమాలు చేశాం. ఇప్పుడు కూడా ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో దాదాపు ఇరవై నిమిషాల ఒక స్పెషల్‌ ఎపిసోడ్‌ ఉంది. అది ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తుంది” అన్నారు.

సినిమాటోగ్రాఫర్‌ ప్రవీణ్‌ మాట్లాడుతూ – ”అన్ని టెక్నికల్‌ వాల్యూస్‌తో ఎక్కడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్‌ కాకుండా ఈ సినిమాను తెరకెక్కించాం” అన్నారు.

డిస్ట్రిబ్యూటర్‌ బ్రహ్మయ్య మాట్లాడుతూ – ”సప్తగిరిగారి మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను హక్కుల్ని కొనడం జరిగింది. ఆయన నటించిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌, ,’సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’ సినిమాలు మంచి విజయం సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉంది. గతంలో నేను ‘రంగస్థలం’, ‘ఆర్‌ఎక్స్‌100’, ‘గీత గోవిందం’ లాంటి ఎన్నోసూపర్‌ హిట్‌ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశాం. ఇప్పుడు ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో ఎంటైర్‌ ఆంధ్రప్రదేశ్‌ హక్కుల్ని తీసుకోవడం జరిగింది” అన్నారు.

వైభవీ జోషీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అర్చనా వేద, టెంపర్‌ వంశీ, అప్పారావు, అవినాష్‌, రాజేంద్ర జాన్‌ కొట్టోలి, వీరేన్‌ తంబిదొరై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్‌ వనమాలి, కథ: జి.టి.ఆర్‌ మహేంద్ర, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, ఆర్ట్‌: అర్జున్‌ సూరిశెట్టి, స్టంట్‌ మాస్టర్‌: జాషువా,ఎడిటింగ్‌: కిషోర్‌ మద్దాలి, పాటలు: రామజోగయ్య శాస్రి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సలాన బాలగోపాలరావు, స్క్రీన్‌ ప్లే-దర్శకత్వం: అరుణ్‌ పవార్‌.

ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు విజయ్‌ బుల్గానిన్‌, ఎడిటర్‌ కిషోర్‌ మద్దాలి ప్రసంగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here