సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘మహర్షి’ టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌

0
159

‘సక్సెస్‌లో ఫుల్‌స్టాప్స్‌ ఉండవు… కామాస్‌ మాత్రమే ఉంటాయి..’

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఉగాది కానుకగా శనివారం విడుదల చేశారు. ఈ టీజర్‌లో సూపర్‌స్టార్‌ మహేష్‌ స్టైలిష్‌ క్లాస్‌ లుక్‌తో కనిపిస్తూనే.. యాక్షన్‌ సీక్వెన్స్‌లలో మాస్‌ ఆడియన్స్‌ని కూడా అలరించే విధంగా పెర్‌ఫార్మ్‌ చేశారు. ‘సక్సెస్‌లో ఫుల్‌స్టాప్స్‌ ఉండవు… కామాస్‌ మాత్రమే ఉంటాయి’, ‘సక్సెస్‌ నాట్‌ ఎ డెస్టినేషన్‌. సక్సెస్‌ ఈజ్‌ ఎ జర్నీ’, ‘నాకో ప్రాబ్లమ్‌ ఉంది సర్‌.. ఎవరైనా నువ్వు ఓడిపోతావ్‌ అంటే… గెలిచి చూపించడం నాకు అలవాటు’ అంటూ సూపర్‌స్టార్‌ మహేష్‌ చెప్పే డైలాగ్స్‌ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. దేవిశ్రీప్రసాద్‌ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా రిచ్‌గా ఉంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ ‘ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి యాదే..’కి శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్‌ మూవీకి కె.యు.మోహనన్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్‌, సునీల్‌బాబు, కె.ఎల్‌.ప్రవీణ్‌, రాజు సుందరం, శ్రీమణి, రామ్‌-లక్ష్మణ్‌ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here