మజిలీ సినిమాలో చైతన్య, సమంతలతో కలిసి నటించడం ప్రివిలేజ్‌గా ఫీలయ్యాను – హీరోయిన్‌ దివ్యాంశ కౌషిక్‌

0
541

యువసామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య హీరోగా, సమంత అక్కినేని, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్లుగా ‘నిన్నుకోరి’ ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మాతలుగా తెరకెక్కిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మజిలీ’. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌, పాటలు సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. ఏప్రిల్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్‌ దివ్యాంశ కౌషిక్‌తో ఇంటర్వ్యూ.

మీ నేపథ్యం గురించి చెప్పండి?
– మాది ఢిల్లీ. మూడేళ్లుగా ముంబైలో ఉంటున్నాను. నటనలో శిక్షణ తీసుకున్న తర్వాత పోర్ట్‌ఫోలియో సిద్ధం చేసుకుని అవకాశాల కోసం చూస్తున్నాను. ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని. మోడల్‌గా ఫెయిర్‌ అండ్‌ లవ్‌ లీ, ప్యాంటీన్‌ షాంపు, హీరో హోండా బైక్‌ వంటి కమర్షియల్‌ యాడ్స్‌లో నటించాను. అలా ఆడిషన్స్‌లో ‘మజిలీ’ సినిమాకు ఎంపిక అయ్యాను. నా తొలి చిత్రం ఫ్యాషన్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ బేనర్‌పై సిద్ధార్థ్‌ సరసన నటిస్తున్నాను. ఆ చిత్రం మే లేదా జూన్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. తెలుగులో ‘మజిలీ’ నా తొలి చిత్రం. ముంబైలో శిక్షణ సమయంలో వర్క్‌షాప్స్‌లో పాల్గొన్నాను.

సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
– ‘మజిలీ’ చిత్రంలో నా పాత్ర పేరు అన్షు. చైతన్యను ప్రేమించే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. ప్రస్తుతానికి ఇంత కంటే నా పాత్ర గురించి ఏమీ చెప్పలేను.

చైతన్యతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌?
– చైతన్యతో వర్క్‌ చేయడం చాలా హ్యాపీ. వెరీ డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌. అమేజింగ్‌ కో-స్టార్‌. చాలా హ్యాండ్‌సమ్‌ కూడా. నటన పరంగా నాకెంతో హెల్ప్‌ చేశారు. ఈ చిత్రంలో నాకు నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకి థాంక్స్‌.

తెలుగులో నటించడం కష్టంగా అనిపించిందా?
– అలాంటిదేమి లేదండీ. చాలా ఇష్టపడే నటించాను. ప్రస్తుతానికి తెలుగు కాస్త అర్థం చేసుకోగలను. కానీ… మాట్లాడలేను. తమిళ్‌లో నటించడం తెలుగుతో పోల్చితే కొంచెం కష్టంగా అనిపించింది. ఇక్కడ యూనిట్‌ బాగా సపోర్ట్‌ చేశారు.

ఈ సినిమాలో సమంతతో కలిసి నటించారా?
– నటిగా సమంత అంటే ఇష్టం. కాని ఈ సినిమాలో కథ పరంగా ఆమెతో కలిసి నటించే అవకాశం రాలేదు. కానీ సమంతగారు నటించిన ‘ఈగ’ సినిమా హిందీ అనువాదం కొన్ని వందల సార్లు చూశాను. తొలిసారి షూటింగ్‌లో చైతును కలిసినప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌ సమంత అని తెలిసింది. చాలా ఎగ్జయిట్‌ అయ్యి ఆమెతో సెల్ఫీ ఇప్పించమని అడిగాను. అలా వారిద్దరితో ఫోటోలు దిగడం నేనెప్పటికీ మర్చిపోలేను.

దర్శకుడు శివ నిర్వాణ గురించి?
– డైరెక్టర్‌ శివగారు ఎంతగానో సపోర్ట్‌ చేశారు. ఆయన ఇచ్చిన స్వేచ్ఛతోనే బాగా నటించాను. డైరెక్టర్‌గా నన్ను గైడ్‌ చేయడమే కాకుండా నాలో కాన్ఫిడెన్స్‌ను బాగా పెంచారు. వెరీ టాలెంటెడ్‌ డైరెక్టర్‌.

చై, సామ్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది?
– తెలుగులో చైతన్య, సమంతతో కలిసి నటించడం ప్రివిలేజ్‌గా ఫీలయ్యాను. ఎందుకంటే వారు పెళ్లి తర్వాత జంటగా నటించిన చిత్రమిది. నేను తెలుగులోకి ఎంట్రీ కాకముందు ‘ఏమాయ చేసావె’ సినిమా చూశాను. ఇద్దరి పెయిర్‌ను బాగా ఇష్టపడ్డాను.

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు చూశారా?
– చూశాను. ‘అర్జున్‌ రెడ్డి’, ‘నిన్నుకోరి’ చిత్రాలు చూశాను. ఇంకా ‘రంగస్థలం’, ‘ఆర్‌.ఎక్స్‌ 100’ సినిమాలు చూడాలి. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా హిందీలో రీమేక్‌ అవుతుంది కాబట్టి దాని కోసం చాలా ఎగ్జయిటెడ్‌గా వెయిట్‌ చేస్తున్నాను.

ఫ్యూచర్‌లో ఎలాంటి సినిమాలకు ఇంపార్టెన్స్‌ ఇస్తారు?
– ‘మజిలీ’ సినిమాలో నా పాత్ర తీరు దాన్ని దర్శకుడు మలిచిన విదానం నాకు బాగా నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. అయితే ఇక పై మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలతో పాటు గ్లామర్‌ పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను.

‘మజిలీ’ సినిమా ఎలా ఉండబోతుంది?
– ‘మజిలీ’ ఒక మంచి ఫ్యామిలీ డ్రామా. దర్శకుడు శివ నిర్వాణ సినిమాను అద్భుతంగా మలిచారు. చిన్న చిన్న సన్నివేశాలను కూడా అద్భుతంగా మలిచారు. ప్రతిరోజూ మనం ఫేస్‌ చేసే విషయాలను కూడా చక్కగా ఎలివేట్‌ చేశారు. ఇక సినిమాలో నా క్యారెక్టర్‌కి కూడా మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుంది.

ఆడియోలో మీకు నచ్చిన పాటలు?
– ఈ సినిమాకి నేషనల్‌ అవార్డు విన్నర్‌ గోపీ సుందర్‌ సంగీతం చాలా ప్లస్‌ అవుతుంది. ఆల్‌రెడీ ఇప్పటికే విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. నాకు ఈ అల్బమ్‌లో ‘ప్రియతమా’, ‘నా గుండెలో…’ సాంగ్స్‌ నా ఫేవరేట్‌.

నటిగా మీ ఇన్‌స్పిరేషన్‌ ఎవరు?
– బాలీవుడ్‌లో ఆలియా భట్‌, కరీనా కపూర్‌, అనుష్క శర్మలను ఇష్టపడతాను. ఇక్కడ సమంత నటనంటే ఇష్టం.

తదుపరి చిత్రాలు?
– కొన్ని చిత్రాలు డిస్కషన్‌ దశలో ఉన్నాయి. వాటి వివరాలను త్వరలోనే తెలియజేస్తాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరోయిన్‌ దివ్యాంశ కౌషిక్‌.

http://industryhit.com/t/2019/03/divyansha-kaushik-pics/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here