రాహుల్ విజయ్, నీహారిక కొణిదెల, పెర్లిన్ భీసేనియా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సూర్యకాంతం’ ఈ సినిమా ద్వారా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వరుణ్ తేజ్ సమర్పణలో నిర్వాణ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ ఎర్రంరెడ్డి, సుజన్ ఎరబోలు, రామ్ నరేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ పెర్లిన్ బీసానియాతో ఇంటర్వ్యూ.
మీ గురించి?
– నా పూర్తి పేరు పెర్లిన్ భీసానియా. నేను ముంబైలో పుట్టి, పెరిగాను. నేను దాదాపు 30కి పైగా యాడ్స్ చేశాను. మెక్ డొనాల్డ్స్, హెయిర్ అండ్ కేర్‌తో పాటు చాలా యాడ్స్ చేశాను. నా గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక 20 ఏళ్లకి నటించడం మొదలుపెట్టా. నేను ‘లా’ కూడా చేశాను. నటించడం నాకు చాలా ఇష్టం. అటు నటన, ఇటు ‘లా’ రెండిటినీ బ్యాలన్స్ చేస్తున్నా. తెలుగులో ‘సూర్యకాంతం’ నాకు ఇది తొలి సినిమా.
ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్టయ్యింది?
– నేను మోడల్‌గా చేశాను. నాకు హైదరాబాద్‌లో ఓ మేనేజర్ ఉండేవారు. ఒక సినిమా చేస్తున్నారని, ఒక సారి మీటింగ్‌కి రమ్మని అతను పిలిచారు. నేను మీటింగ్‌కి వచ్చాను. దర్శకుడు ప్రణీత్‌గారిని కలిశాను. ఆయన నాకు బ్రీఫ్‌గా కాన్సెప్ట్ చెప్పారు. రాహుల్ విజయ్ కూడా అప్పుడు ముంబైకి వచ్చారు. అక్కడ ఆడిషన్స్ చేశాం. అప్పుడు నాకు డైలాగులు ఇవ్వలేదు. కానీ ఎమోట్ చేయమని అడిగారు. నవ్వమని, బాధపడమని, ఇలా కొన్ని ఎమోషన్స్ చెప్పారు. చేశాను. ఫొటో షూట్ చేశారు. కొన్నాళ్ల తర్వాత ప్రణీత్ నాకు ఫోన్ చేసి ఈ కథ మొత్తం చెప్పారు. నాకు కథ భాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ఓకె అయ్యింది.
‘సూర్యకాంతం’ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి?
– ఈ సినిమాలో పూజా అనే పాత్ర చేశా. చాలా మెచ్యూర్‌గా, సెన్సిబుల్‌గా ఉంటుంది. సెన్సిటివ్‌గా ఉంటుంది. ఎవరైనా నచ్చితే నేరుగా తన తల్లిదండ్రులకు చెప్పే రకం ఆమె. నిజ జీవితంలో నాకు, తనకు 20 శాతం పోలికలుంటాయి. నేను బబ్లీగా ఉంటాను. చాలా మాట్లాడుతాను. కానీ పూజా అలా కాదు. చాలా కామ్‌గా ఉంటుంది. చాలా ఫోకస్‌గా ఉంటుంది. తన జీవితంలో ఏం కావాలో తనకి బాగా తెలుసు.
ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీనా?
– ఇది కేవలం ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మాత్రమే కాదు. అంతకు మించి ఇందులో చాలా ఉంటుంది. ‘సూర్యకాంతం’ బైపోలార్. చాలా ఎక్సెంట్రిక్. సేమ్ టైమ్ తను చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. తను మంచిగా ఉండగలదు, అదే సమయంలో ఎక్సెంట్రిక్‌గా ఉంటుంది.
నీహారికలో వర్క్ ఎక్స్‌పీరియన్స్?
– ఈ సినిమాలో నాకు నీహారికకు చాలా సీన్లు ఉన్నాయి. తనతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నీహారిక నిజ జీవితంలో చాలా జెన్యూన్ పర్సన్. నటిగా కూడా జెన్యూన్ పర్సన్. తనతో పాటు మా టీమ్ అందరూ చాలా మంచి కోస్టార్స్. అందుకే నాకు తెలుగులో మాట్లాడటం కూడా తేలికైంది. నాకు ఇచ్చిన లైన్లకు అర్థాన్ని ఇంగ్లిష్‌లో రాసుకునేదాన్ని. డిక్షన్‌ను హిందీలో రాసుకునేదాన్ని. అందుకే చాలా ఈజీగా చెప్పాను.
ఆడియోకి రెస్పాన్స్ ఎలా ఉంది?
– ఈ సినిమాలో మ్యూజిక్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. నాకు మూడు పాటలున్నాయి. మార్క్ కె. రాబిన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్తాయనడంలో సందేహం లేదు.
దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి గురించి చెప్పండి?
– ప్రణీత్ మా పాత్రలను చాలా బాగా రాశాడు. ఈ సినిమాలో కొన్ని పాత్రలను ప్రణీత్ నిజ జీవితం నుంచి చాలా ఇన్‌స్పయిర్ అయి రాసినట్టు అనిపించింది. సినిమా కోసం మన జీవితంలో కొన్ని నెలలను స్పెండ్ చేస్తాం. ఇది నాకు కొత్త ఎక్స్ పీరియన్స్. యాడ్స్ రెండు రోజుల్లో చేసేవాళ్లం. కాకపోతే యాక్టింగ్‌లో నేను ఫార్మల్ ట్రైనింగ్ తీసుకున్నా. నాకు కొన్ని డ్యాన్సులు తెలుసు. అందువల్ల సినిమా చేయడం తేలికైంది. సీనియర్ నటి సూర్యకాంతం గురించి చాలానే విన్నా. ఈ సినిమాలో సూర్యకాంతం పాత్రకు, పూజ పాత్రకు చాలా తేడాలున్నాయి.
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు చూశారా?
– నాకు ‘అర్జున్‌రెడ్డి’ హిందీ వెర్షన్‌కు అవకాశం వచ్చింది. కానీ ఎందుకో కుదరలేదు. ఈ సినిమాతో పాటు ‘ఈగ’, ‘బాహుబలి’, ‘ఈ మాయపేరేమిటో’, ‘హ్యాపీ వెడ్డింగ్’ వంటి సినిమాలు చూశా.
మీ ఫ్యావరేట్ యాక్టర్స్?
– దక్షిణాదిన అనుష్క శెట్టి చాలా ఇష్టం. ఆమె చాలా మంచి ఆర్టిస్ట్. చాలా బాగా చేస్తుంది. తను చేసే పాత్రలోకి మారిపోతుంది. హిందీలో కరీనా కపూర్ అంటే చాలా ఇష్టం.
మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్?
– నేను’సూర్యకాంతం’ చిత్రాన్ని మొదలుపెట్టగానే నాకు ఆఫర్లు వచ్చాయి. నా పనితీరు నచ్చి చాలా మంది అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు కొన్ని ఆఫర్లు ఉన్నాయి. వాటి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను..అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరోయిన్ పెర్లిన్ భీసానియా
http://industryhit.com/t/2019/03/perlene-bhesania-pics/