ఫస్ట్‌ సీన్‌ నుండి లాస్ట్‌ సీన్‌ వరకు ఆడియెన్స్‌ను నవ్వించే సినిమా ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ – హీరో ఆదిత్‌ అరుణ్‌

0
469

కథ, తుంగభద్ర, పిఎస్వీ గరుడ వేగా, 24కిస్సెస్‌ లాంటి విభిన్న కథా కథనాలతో రూపొందిన చిత్రాలకు ప్రాధాన్యమిస్తూ.. తన నటన ద్వార మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో ఆదిత్‌ అరుణ్‌, ఇటీవల బ్లూ ఘోస్ట్‌ పిక్చర్స్‌ బేనర్‌పై సంతోష్‌ పి జయకుమార్‌ దర్శకత్వంలో అడల్ట్‌ హారర్‌ కామిడీగా రూపొందిన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. మా 21న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అవుతున్న సందర్భంగా హీరో ఆదిత్‌ అరుణ్‌ ఇంటర్వ్యూ.

ఈ ప్రాజెక్టు ఎలా స్టార్ట్‌ అయ్యింది?
– నేను నా కెరీర్‌ స్టార్టింగ్‌ నుండి తెలుగు, తమిళ్‌ మూవీస్‌ చేస్తూ వస్తున్నాను. అయితే నేను ‘గరుడవేగా’ చేస్తున్న టైములో ఒక రోజు ఫ్లైట్‌లో జ్ఞానవేల్‌ రాజా గారు కలిసి ఈ సినిమాలో కొన్ని పిక్స్‌ చూపించి ఈ సినిమాను నేను చేద్దాం అనుకుంటున్నాను. మీరు నటిస్తారా? అని అడిగారు. నేను చూసి నటిస్తాను సర్‌ అని చెప్పాను. నేను తెలుగులో ’24 కిస్సెస్‌’ చేస్తుండడంతో ఆ సినిమాను తమిళంలో వేరే నటీనటులతో చేయటం జరిగింది. అయితే ఆ సినిమాని తెలుగులో రీమేక్‌ చేస్తాను అని అనడంతో ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయ్యింది.

విభిన్న చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు?
– రెగ్యులర్‌ ప్యాట్రర్న్‌లో సినిమాలు చేయను కాబట్టి నేను నా ప్రతి సినిమాను భయపడుతూనే చేస్తాను. నా సినిమాలు ’24 కిస్సెస్‌’ కానివ్వండి, ‘ఎల్‌ 7 ‘ కానివ్వండి, ‘కథా’ సినిమా కానివ్వండి అన్ని డిఫరెంట్‌ స్టోరీస్‌ కే మొగ్గు చూపి ఎడ్వెంచరస్‌ మూవీస్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాను.

తెలుగులో ఇదిబోల్డ్‌ అటెంప్ట్‌ కదా..ఎలా అనిపిస్తుంది?
– మనం సినిమా చూసి నిజంగా నవ్వుకుని తరువాత కూడా మాట్లాడుకునే సినిమాలలో ‘అప్పుల అప్పారావు’ కానీ ‘జంబలకిడి పంబ’ సినిమా తప్పకుండా ఉంటుంది. అంటే సినిమా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయగలిగితే వారు ఏ జోనర్‌లో అయినా చూస్తారు అన్నదానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే తమిళ్‌లో పరిస్థితి వేరే విధంగా ఉంటుంది వారికి డిఫరెంట్‌ స్టోరీ అయితేనే వారు చూస్తారు. తెలుగులో అలా కాదు మనం ఈ జోనర్‌లో అయినా చెయ్యొచ్చు కానీ అది ప్రేక్షకులని పూర్తిగా ఎంటర్‌టైన్‌ చేయగలగాలి అప్పుడే వారు చూస్తారు. అందుకే ఈ సినిమా విజయం పట్ల మా టీవమ్‌ అందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.

సినిమా స్టోరీలైన్‌ గురించి చెప్పండి?
– ఈ సినిమాలో నా క్యరెక్టర్‌ పేరు చందు. పెళ్లి కోసం అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు. ఆ క్రమంలో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అయితే ఒకరిని ఒకరు బాగా తెలుసుకున్న తరువాత పెళ్లి చేసుకుంటే మంచిదని నమ్మి తాను పెట్టె షరతులతో ఆ అబ్బాయి ఎలాంటి సంఘటనలు ఎదురుకున్నారు అనేది స్టోరీ లైన్‌. ఈ స్టోరీ లైన్‌ను డైరెక్టర్‌ పూర్తి ఎంటర్టైన్మెంట్‌ వేలో చెప్పడం జరిగింది.

టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?
– సినిమాలో మనం ఎం చెప్పదలుచుకున్నామో.. అదే టైటిల్‌గా పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అందుకే తమిళ్‌లో ఈ సినిమా పేరు ‘ఇరుటారియల్‌ మొరటు కుత్తు’ ఈ టైటిల్‌కి తెలుగు ట్రాన్స్‌లేషన్‌ ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ ఒక పెద్ద డైరెక్టర్‌ సజెస్ట్‌ చేయడం జరిగింది. ఈ సినిమాలో స్కిన షో గాని లిప్‌లాక్‌లు కానీ అస్సలు ఉండవు. అన్ని స్టాండర్డ్స్‌కి లోబడే సినిమాను తీయడం జరిగింది. సినిమా ఫస్ట్‌ సీన్‌ నుండి లాస్ట్‌ సీన్‌ వరకు ఆడియెన్స్‌ నవ్వుతూనే ఉంటారు.

ఎన్ని రోజులు షూట్‌ చేశారు ?
– ఈ సినిమా ఆల్రెడీ తమిళ్‌లో విడుదలై సూపర్‌ హిట్‌ కలెక్షన్స్‌ సాధించింది. అందుకే అదే స్టోరీతో నా కెరీర్‌లో అతి తక్కువ సమయంలో కంప్లీట్‌ చేసిన సినిమా ఇదే. ఈ చిత్రానికి నేను కేవలం 19 రోజులు మాత్రమే తీసుకున్నాను.

ఈసినిమా చేయడానికి గల కారణం ?
– చాలా మంది ఈ సినిమా డబ్బులు కోసం చేసావా అని అడుగుతున్నారు. మనీ కోసం కాదు సినిమా స్టోరీ బాగా నచ్చింది. ఈ చిత్రం చేస్తున్నప్పుడు జెన్యూన్‌గా బాగా ఎంజాయ్‌ చేశా. నేను ఒక కాంపిటేటివ్‌ని కానీ ఇక్కడ ఎవ్వరితో కాంపిటేషన్‌ కోసం నేను రాలేదు.నాకు నచ్చిన సినిమాను ఎంజాయ్‌ చేస్తూ చెయ్యాలి అనేది నా పాలిసీ.

మీ తదుపరి చిత్రాలు గురించి?
– ప్రస్తుతం కొలంబస్‌ సినిమా ఫేమ్‌ రమేష్‌ శ్యామలతో ‘డ్యూడ్‌’ అనే చిత్రాన్ని చేస్తున్నాను. ఫ్రెండ్షిప్‌ నేపథ్యంలో ఉంటుంది. ఈ సినిమాలో నాతో పాటు ప్రిన్స్‌ , ప్రియదర్శి కూడా నటిస్తున్నాను. సినిమా షూటింగ్‌ సగభాగం పూర్తయ్యింది, ఇది కాక మరో రెండు చిత్రాలకు సైన్‌ చేశాను. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో ఆదిత్‌ అరుణ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here