‘వినియోగదారుల సంక్షేమ నిధి’ కి రూ 35.66 లక్షలు ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్

0
108

ఏ ఎం బి సినిమాస్ కి ప్రేక్షకుల నుండి జి ఎస్ టి రూపంలో అదనంగా వచ్చిన రూ 35.66 లక్షల ను వినియోగదారుల సంక్షేమ నిధి కి చెల్లించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ను జి ఎస్ టి హైదరాబాద్ కమిషనరేట్ ప్రశంసించింది. ఏ ఎం బి సినిమాస్ యజమానులైన మహేష్ బాబు, సునీల్ నారంగ్ లు తమది కాని లాభాన్ని గుర్తించి తిరిగి చెల్లించినందుకు అభినందిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎవరూ ఇలా బాధ్యతగా జీ ఎస్ టీ ని వెనక్కు తిరిగి ఇవ్వలేదని… మహేష్ బాబు, సునీల్ లు అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, లోని థియేటర్ల యజమానుల పై ఈ నిర్ణయం సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది. సూపర్ స్టార్ ఏ విషయంలోనైనా సూపర్ స్టారే అని మరోసారి ఋజువైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here