ప్రముఖ దర్శకుడు శ్రీ కోడి రామకృష్ణ మృతి పట్ల ప్రముఖుల నివాళులు

0
171

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతి తీవ్ర విచారకరం. ఎన్నో విజయవంతమైన గ్రామీణ ప్రాంత నేపధ్యంతో కూడిన కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు, తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితో సినిమాలు రూపొందించిన ఘనత సాధించిన ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు. – ఆంధ్ర  సీఎం చంద్రబాబు 

ప్రముఖ దర్శకుడు శ్రీ కోడి రామకృష్ణ మృతి పట్ల తెలంగాణ సీఎం శ్రీ కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినీరంగంలో తనదైన శైలితో ఎన్నోచిత్రాలను తెరకెక్కించి, 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని కోడి రామకృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు.

కోడి రామ‌కృష్ణ మ‌ర‌ణం తీర‌ని లోటు – నంద‌మూరి బాల‌కృష్ణ‌
సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కోడి రామ‌కృష్ణ‌గారు అనారోగ్యంతో క‌న్నుమూయ‌డం ఎంతో బాధాక‌రం. శ‌తాధిక ద‌ర్శ‌కుడిగా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు చిత్ర సీమ‌కు అందించారాయ‌న‌. ఎమోష‌న‌ల్ చిత్రాల‌ను అద్భుతంగా తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో కోడి రామ‌కృష్ణ‌గారు ముందు వ‌రుస‌లో ఉంటారు. అలాగే ఆయ‌న వైవిధ్య‌మైన చిత్రాల‌ను కూడా అందించారు. ట్రెండ్‌కు త‌గిన‌ట్లు గ్రాపిక్స్ చిత్రాల‌ను కూడా అద్భుతంగా తెర‌కెక్కించారు. ఆయ‌న‌తో క‌లిసి మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు, ముద్దుల క్రిష్ణ‌య్య‌, ముద్దుల మావ‌య్య, ముద్దుల మేన‌ల్లుడు, భార‌తంలో బాల‌చంద్రుడు, మువ్వ గోపాలుడు, బాల‌గోపాలుడు చిత్రాల‌కు ప‌నిచేశాను. ఇలాంటి గొప్ప ద‌ర్శ‌కుడిని కోల్పోవ‌డం సినీ ప‌రిశ్రమ‌కు తీర‌నిలోటు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని, ఆ భ‌గ‌వంతుడు వారి కుటుంబ స‌భ్యుల‌కు మ‌నోధైర్యాన్ని ప్ర‌సాదించాల‌ని ప్రార్థిస్తున్నాను.

కోడిరామ‌కృష్ణ‌లాంటి క‌మిట్‌మెంట్ ఉన్న ద‌ర్శ‌కుడిని కోల్పోవడం దుర‌దృష్టక‌రం – హీరో వెంక‌టేష్
కోడిరామ‌కృష్ణ‌గారు డైరెక్ట‌ర్‌గా డిఫ‌రెంట్‌ సినిమాల‌తో త‌న‌దైన ముద్ర‌వేశారు. నేను ఆయ‌న డైరెక్ష‌న్‌లో `శ‌త్రువు`,` దేవీపుత్రుడు` సినిమాల‌ను చేశాను. `శ‌త్రువు` సినిమాకు ఆయ‌నకు ఫిలింఫేర్ అవార్డ్ కూడా వ‌చ్చింది. ఇలా చాలా డిఫ‌రెంట్ సినిమాల‌తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా అంద‌రినీ మెప్పించారు. ఎంతో క‌మిట్‌మెంట్ ఉన్న డైరెక్ట‌ర్‌. అలాంటి ఓ డైరెక్ట‌ర్‌ని కోల్పోవ‌డం బాధాక‌రం. కోడిరామ‌కృష్ణ‌గారు లేని లోటు తీర్చ‌లేనిది. ఆయ‌న కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను.

నాకు అత్యంత ఆత్మీయులు శ్రీ కోడి రామ‌కృష్ణ గారి మ‌ర‌ణం బాధాక‌రం. తెలుగు సినిమా ఓ మంచి ద‌ర్శ‌కున్ని కోల్పోయింది. తెర‌పై ఆయ‌న ఎన్నో అద్భుతాలు సృష్టించారు. అలాంటి ద‌ర్శ‌కుడు క‌న్నుమూయ‌డం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి తీర‌నిలోటు. ఆయ‌న‌తో నేను కూడా కొన్ని సినిమాల‌కు ప‌ని చేసే గౌర‌వం ద‌క్కింది. శ్రీ కోడి రామ‌కృష్ణ గారి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను.. మీ మంచు మోహ‌న్ బాబు..

కోడిరామకృష్ణ గారి హఠాన్మరణ వార్త విని తీవ్ర వేదనకు లోనయ్యాను. నాకు అత్యంత ఆత్మీయులు శ్రీ కోడి రామ‌కృష్ణ గారి మ‌ర‌ణం బాధాక‌రం. తెలుగు సినిమా ఓ మంచి దర్శకుడి ని కోల్పోయింది. తెర‌పై ఆయ‌న ఎన్నో అద్భుతాలు సృష్టించారు. అలాంటి ద‌ర్శ‌కుడు క‌న్నుమూయ‌డం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి తీర‌నిలోటు. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించిన ఉత్తమ దర్శకుడు, పరిశ్రమలో అందరికీ ఎంతో ఆప్తుడు, నాకు మంచి మిత్రులు కోడి రామకృష్ణ గారు లేకపోవడం పరిశ్రమకి ఎప్పటికీ తీరని లోటు. అందరికీ మంచి మిత్రులు. అందరితోనూ ఎంతో సన్నిహితంగా ఉంటారు. అందరితో చాలా కలుపుగోలుగా ఉండేవారు. దేనికైనా ఆయన ఉత్సాహంగా ముందుండే వారు. అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా లోటు. వ్యక్తిగతంగా మంచి మిత్రున్ని కోల్పోయాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు నా సానుభూతిని తెలుపుతున్నాను. – నిర్మాత, రాజ్యసభ సభ్యులు, డా. టి. సుబ్బరామిరెడ్డి

కోడి రామ‌కృష్ణ‌గారు ఓ సినీ లైబ్ర‌రీ – బోయ‌పాటి శ్రీను
కోడి రామ‌కృష్ణ‌గారు సినీ లైబ్ర‌రీ. ఓ గ్రేట్ డైరెక్ట‌ర్ ఇక లేరు అనే విష‌యం తెలియ‌గానే ఎంతో బాధ‌ప‌డ్డాను. ఆయ‌న కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాను

కోడి రామ‌కృష్ణ‌గారి మ‌ర‌ణ‌వార్త నన్నెంతో బాధించింది – శర్వానంద్‌
తెలుగు చిత్ర సీమ ఓ గొప్ప ద‌ర్శ‌కుడ్ని కోల్పోయింది. ఇలాంటి ద‌ర్శ‌కులు అరుదుగా పుడుతుంటారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త నన్నెంతో బాధించింది. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ఆ దేవుడు ధైర్యాన్ని ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్నాను

కోడి రామకృష్ణ నాకు ఆత్మీయులు. ఇండస్ట్రీలో అందరికీ మంచి మిత్రులు. అందరితోనూ ఎంతో సన్నిహితంగా ఉంటారు. మా దుర్గ ఆర్ట్స్ బ్యానర్లో ‘దొంగాట’ లాంటి శతదినోత్సవ చిత్రాన్ని ఇచ్చారు. ఎప్పుడు కలిసినా ‘ఎం డైరెక్టర్ గారు అనగానే…చంపేద్దాం గురువు గారు’ అనేవారు. అందరితో చాలా కలుపుగోలుగా ఉండేవారు. దేనికైనా ఆయన ఉత్సాహంగా ముందుండే వారు. అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా లోటు. వ్యక్తిగతంగా మంచి మిత్రున్ని కోల్పోయాను. పరిశ్రమకు కూడా తీరని లోటు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – ప్రముఖ నిర్మాత, నిర్మాతల మండలి అధ్యక్షులు డా || కె ఎల్ నారాయణ

ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించిన ఉత్తమ దర్శకుడు, పరిశ్రమలో అందరికీ ఎంతో ఆప్తుడు, నాకు మంచి మిత్రులు కోడి రామకృష్ణ గారు లేకపోవడం పరిశ్రమకి ఎప్పటికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు నా సానుభూతిని తెలుపుతున్నాను. – కె ఎస్ రామారావు, క్రియేటివ్ కమర్షియల్స్

కోడిరామ‌కృష్ణ‌గారు ఎంద‌రికో స్ఫూర్తి ప్ర‌దాత‌- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌
తెలుగు సినిమా చరిత్ర‌లో వంద చిత్రాల‌కు పైగా దర్శ‌క‌త్వం వ‌హించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ముప్పై ఏళ్ల సుదీర్ఘ అనుభ‌వంలో కోడి రామ‌కృష్ణ‌గారు ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను అందించారు. ఇప్ప‌టికీ ఆయ‌న తీసిన చిత్రాలు మ‌ర‌చిపోలేం. ఎమోష‌న‌ల్ మూవీస్‌, భ‌క్తిచిత్రాలు, పొలిటిక‌ల్ మూవీస్ ఇలా అన్నీ ర‌కాల చిత్రాల‌ను తెర‌కెక్కించారు. తన చిత్రాల‌తో నేటి ద‌ర్శ‌కుల‌కు స్ఫూర్తి ప్ర‌దాత‌గా నిలిచారు కోడిరామ‌కృష్ణ‌గారు. ఇలాంటి గొప్ప ద‌ర్శ‌కుడు మ‌న‌ల్ని విడిచి పెట్టి వెళ్లిపోవ‌డం బాధాకరం. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి.. వారి కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here