థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి’- హీరోయిన్ లక్ష్మీ రాయ్

0
597

మోడల్‌గా కెరీర్‌ మొదలుపెట్టి… ‘కాంచనమాలకేబుల్‌టీవి’, ‘అధినాయకుడు’ వంటి చిత్రాల్లో తనదయిన నటనతో ప్రేక్షకులని మెప్పించి తెలుగు, తమిళ్‌, మలయాళం, కన్నడ ,హిందీ భాషల్లో హీరోయిన్‌గా కొనసాగుతున్నఅందాలభామ లక్ష్మీరాయ్‌. తెలుగులో టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘వేర్‌ఈజ్‌ ద వెంకటలక్ష్మి’. హీరోయిన్‌ సెంట్రిక్‌మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సందర్భంగా లక్ష్మీరాయ్‌ ఇంటర్వ్యూ.

చాలాకాలం తరువాత తెలుగులో స్ట్రయిట్‌ సినిమా చేస్తున్నారు?
– హీరోయిన్‌గా తెలుగులో సినిమా తీసి చాలా కాలం అయింది. కానీ గెస్ట్‌రోల్స్‌, స్పెషల్‌సాంగ్స్‌ ద్వారా తెలుగు ఆడియన్స్‌కి, టాలీవుడ్‌ ఇండస్ట్రీకి టచ్‌ లోనే ఉన్నాను.

ఈ సినిమాలో మీరే టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారా?
– అవునండీ! ఈ సినిమాలో నేను వెంకటలక్ష్మి అనే టీచర్‌ పాత్రలో కనిపిస్తాను. కానీ కథ పరంగా స్కూల్‌కి వెళ్లడం, స్టూడెంట్స్‌కి పాఠాలు చెప్పడం లాంటి అంశాలు ఈ సినిమాలో ఉండవు. నేను ఆ ఉరికి వచ్చిన తరువాతనే సినిమా స్టార్ట్‌ అవుతుంది. ఇది ‘మైహూనా’ సినిమాలో సుష్మితాసేన్‌ చేసిన చాంధిని పాత్రకు దగ్గరగా ఉండి అటు గ్లామర్‌తో పాటు ఇటు పెర్‌ఫామెన్స్‌ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో మిమ్మల్ని ఇన్‌స్పైర్‌ చేసిన అంశాలేమిటి?
– ముఖ్యంగా ఇది లైట్‌హార్టెడ్‌ ఫిలిం. ఈ సినిమాలో కనిపించే ప్రతి పాత్ర ఎదో ఒకటి లేదా ఎవరినో ఒకర్ని వెతుకుతూనే ఉంటాయి. ఆ ప్రాసెస్‌లోనే చాలా కామెడీ, డ్రామా జెనెరేట్‌ అవుతుంది. ఈ సినిమాలో మంచి థ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌ కూడా ఉంది. తెలుగులో ఇలాంటి ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ మూవీ వచ్చి చాలాకాలం అయింది. నేను ఇంత వరకు ఇలాంటి జోనర్‌లో సినిమా చేయలేదు. అందుకనే కథ చాలా ఎక్సయిట్‌గా అనిపించి ఈ సినిమా ఒప్పుకున్నాను.

అసలు ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి ?
– సినిమా చూశాకే ఆ పేరుకి, సినిమాకి మధ్య ఉన్న కనెక్షన్ మీకు అర్ధమవుతుంది. అయితే ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ ఇంగ్లీష్ టైటిల్ అయినా.. తెలుగు సినిమానే, సినిమాలో చాలా మంచి ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది. అలాగే కొన్ని ఇంత వరకూ మీరు ఫీల్ అవని కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి.

తెలుగులో మీరు చేసిన ఐటమ్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి కదా..కొనసాగించే అవకాశం ఉందా?
– నేను హిందీ లో జూలీ 2 షూటింగ్‌ టైంలో మెగాస్టార్ చిరంజీవిగారి పక్కన రత్తాలు సాంగ్ లో నటిస్తారా అని ఆఫర్ వచ్చింది. రత్తాలు పాటకు అంతటి హ్యూజ్ స్పందన వస్తుందని నేను ఊహించలేదు. ఒక్క సాంగ్ కే నేను అలాంటి రెస్పాన్స్‌ను సొంతం చేసుకోవడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. ఇక చిరంజీవిగారు 150 ఫిల్మ్ లో ఒక స్పెషల్ సాంగ్ చెయ్యటం చాలా బ్యూటిఫుల్ ఎక్స్ పీరియన్స్. ఆలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారితో నేను ఒక సాంగ్ చెయ్యడం ఎప్పటికీ మర్చిపోలేను..

అకీరా, జూలీ 2 తరువాత బాలీవుడ్ మూవీస్ చేస్తున్నారా ?
– కొన్ని అవకాశాలు వచ్చాయి, కాకపోతే ఇంతవరకూ ఏది అంగీకరించలేదు. కానీ ఫ్యూచర్ లో ఖచ్చితంగా చేస్తాను. ఐతే బాలీవుడ్ ఇండస్ట్రీ.. మన సౌత్ ఇండస్ట్రీ కంటే కాస్త బిన్నంగా ఉంటుంది. అక్కడ ఒక జోనర్ లో మార్క్ పడితే అదే జోనర్ లో మనకు అవకాశాలు వస్తుంటాయి. అందుకనే కొంచెం సెలెక్టివ్ గా ఆలోచించి ముందుకు వెళతాను.

దర్శకుడు కిషోర్ కుమార్ గురించి చెప్పండి ?
– కిషోర్ కుమార్ సెట్ లో చాలా సరదాగా ఉంటారు. వెరీ హార్డ్ వర్కర్. రోజూకి రెండు మూడు షిఫ్ట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందరం ఫ్రెండ్స్ లా కలిసి చేశాము. ఈ సినిమా ద్వారా అతనికి తప్పకుండా మంచి దర్శకుడిగా పేరు వస్తుంది.

ప్రొడ్యూసర్స్‌ గురించి?
– తెలుగు ఇండస్ట్రీ లో చాలా మంది అమేజింగ్‌ ప్రొడ్యూసర్స్‌ ఉన్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాను తక్కువ బడ్జెట్ లో కూడా నిర్మించొచ్చు కానీ ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందివాలని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టి ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించడం జరిగింది.

మ్యూజిక్ డైరెక్టర్ గురించి?
– ఈ సినిమాకు హరి గోరా మ్యూజిక్ డైరెక్టర్ . అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన కంపోజ్ చేసిన అన్నీ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలరిస్తుంది.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
– ప్రస్తుతం మూడు తమిళ్ సినిమాలు అలాగే ఒక కన్నడ సినిమా చేస్తున్నాను. అదేవిధంగా ఇదివరకూ అంగీకరించిన ఒక తెలుగు సినిమా కూడా ఉంది. ఫస్ట్ ఈ సినిమాలు పూర్తి అయ్యాకే మిగితా సినిమాల ఆలోచిస్తాను. అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరోయిన్ లక్ష్మీ రాయ్.

http://industryhit.com/t/2019/02/laxmi-raai-pics/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here