‘ఐఐటీ కృష్ణమూర్తి ‘ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల.. ఫిబ్రవరి 24 న టీజర్..!!

0
79

పృద్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఐఐటీ కృష్ణమూర్తి ‘. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు.. వినూత్నమైన కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటుండగా, తాజాగా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం.. ఈ లుక్ లో “మిస్సింగ్- లాస్ట్ సీన్ సాటర్ డే ఈవినింగ్ ” అనే క్యాప్షన్స్, సినిమా పై మంచి ఇంట్రెస్ట్ ను కలిగిస్తున్నాయి.. ఇంకా ఈ పోస్టర్ లో సీరియస్ లుక్ లో హీరో కనిపిస్తూ ప్రేక్షకులలో ఎంతో క్యూరియాసిటీ కలిగిస్తున్నారు.. వినయ్ వర్మ, భారతి ఆనంద్, బెనర్జీ, కమెడియన్ సత్య ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 24 న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.. వేసవి కానుకగా మే 28 న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. ఈ సినిమా కి నరేష్ కుమారన్ సంగీతం సమకూరుస్తుండగా, యేసు పి సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ప్రేమ్ కుమార్ పాత్ర సమర్పిస్తున్న ఈ సినిమా ని క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై ప్రసాద్ నేకూరి నిర్మిస్తున్నారు..

నటీనటులు : పృద్వీ దండమూడి, మైరా దోషి, వినయ్ వర్మ, భారతి ఆనంద్, బెనర్జీ, కమెడియన్ సత్య తదితరులు..

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు : శ్రీ వర్ధన్
సమర్పణ : ప్రేమ్ కుమార్ పాత్ర
నిర్మాత : ప్రసాద్ నేకూరి
బ్యానర్ : క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీ క్రిష్
సినిమాటోగ్రఫీ: యేసు.పి
సంగీతం: నరేష్ కుమారన్
ఎడిటర్ : అనిల్ కుమార్.పి
రచన : నాగార్జున మనపాక
గీత రచయిత : రామాంజనేయులు సంకర్పూ
లైన్ ప్రొడ్యూసర్ : ఎల్.వి. వాసుకి
ప్రొడక్షన్ కంట్రోలర్ : అశ్విన్ , ఆనంద్ కుమార్
క్యాస్టింగ్ : సూర్య తేజ
కలరిస్ట్ : శ్రీనివాస్ మామిడి
పి.ఆర్.ఓ : సాయి సతీష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here