వైభవంగా నందిగామలో జరిగిన ‘నేనే ముఖ్యమంత్రి’ ప్రీ-రిలీజ్‌!!

0
324

స్వలాభం కోసం కాకుండా ప్రజల‌కు సేవ చేయాల‌నే ఉద్దేశంతో వచ్చే రాజకీయ నాయకుల‌ను మాత్రమే మనం ఎన్నుకోవాల‌నే కథాంశంతో ‘నేనే ముఖ్యమంత్రి’ చిత్రం నిర్మించాం. విద్యార్థులే దేశ భవిష్యత్తు కాబ‌ట్టి , వారు భ‌విష్య‌త్తులో ఎలాంటి నాయ‌కుణ్ని ఎన్నుకోవాలి? ఎలాంటి నాయ‌కుణ్ని ఎన్నుకోవ‌ద్దు అని మా సినిమా చూసి తెలుసుకుంటార‌ని వారి సమక్షంలో నందిగామలోని చైతన్య కాలేజ్‌లో మా చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్‌ కార్యక్రమం ఏర్పాటు చేసామన్నారు ‘నేనే ముఖ్యమంత్రి’ నిర్మాతల్లో ఒకరైన అట్లూరి నారాయణరావు. శ్రీ వైష్ణవి ఫిలింస్‌, ఆలూరి క్రియేషన్స్‌ పతాకాల‌పై అట్లూరి నారాయణరావు , ఆలూరి సాంబశివరావు సంయుక్తంగా ‘నేనే ముఖ్యమంత్రి’ చిత్రాన్ని నిర్మించారు. దేవిప్రసాద్‌, వాయు తనయ్‌, శశి, సుచిత్ర ప్రధాన పాత్రల్లో మోహన్‌ రావిపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల‌ 8న గ్రాండ్‌ గా విడుదవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ బుధవారం నందిగామలోని చైతన్య కాలేజ్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

ఈ సందర్భంగా అట్లూరి నారాయణరావు మాట్లాడుతూ…‘‘ మనల్ని పాలించే నాయకుల‌ను ఎటువంటి వారిని ఎన్నుకోవాలి? ఎటువంటి నాయకును ఎన్నుకోవద్దు ? అనే అంశాన్ని మా చిత్రం ద్వారా చూసిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో నిస్వార్థంతో సేవ చేసే నాయకులు మనకు అవసరం. సరైన నాయకుణ్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనదే అనేది మా సినిమాలో చూపించాం. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు.

మరో నిర్మాత ఆూరి సాంబశివరావు మాట్లాడుతూ…‘‘మా చిత్రం లో సమకాలీన రాజకీయ అంశాల‌ గురించి చర్చించాం. అన్ని వర్గాల‌కు నచ్చే అంశాల‌తో పాటు అందర్నీ ఆలోచింపజేసేలా సన్నివేశాలు, సంభాషణలు ఉంటాయి. పదవి కోసం ఆరాటపడే నాయకుల‌ను కాకుండా బాధ్యతతో పని చేసే వారికే పట్టం కట్టాల‌ని చెప్పే చిత్రమిది. ఈ నెల‌ 8న విడుద చేస్తున్నాం. మా సినిమాను సక్సెస్‌ చేస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.

దర్శకుడు మోహన్‌ రావిపాటి మాట్లాడుతూ..‘‘మన అభివృద్ధి కోసం..మనకు ఎలాంటి నాయకుడు అవసరమో…ఎలాంటి నాయకు అవసరం లేదో తేల్చి చెప్పే సినిమానే ‘నేనే ముఖ్యమంత్రి’. అవినీతి పరుల‌ను కాకుండా నిజాయితీ పరును ఎన్నుకోండి… అని చెబుతూ ఒక మంచి సినిమాను చేసాం. ప్రతి ఒక్కరూ చూసి మా సినిమాను విజయవంతం చేస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.

నందిగామ మున్సిపల్‌ ఛైర్మన్‌ పద్మావతి మాట్లాడుతూ…‘‘ఎల‌క్షన్స్‌ సమీపిస్తోన్న తరుణంలో సరైన చిత్రాన్ని రూపొందించిన దర్శక నిర్మాతల‌ను అభినందిస్తూ…సినిమా విజయవంతం కావాని’’ అన్నారు.

సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్‌ మాట్లాడుతూ…‘‘ డైరక్టర్‌ మోహన్‌గారికి ట్యూన్‌, లిరిక్‌ సెన్స్‌ ఉండటంతో మంచి పాట‌ల‌తో పాటు, నేపథ్య సంగీతం ఇవ్వగలిగాను’’ అన్నారు.

నటుడు శశి మాట్లాడుతూ..‘‘ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రమిది’’ అన్నారు.

మరో నటుడు వాయుతనయ్‌ మాట్లాడుతూ…‘‘నాకిదే తొలి సినిమా. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర ఈ సినిమాలో చేసాను’’ అన్నారు.

చైతన్య కాలేజ్‌ చైర్మన్‌ జ్యోతి, రమేష్‌ దంపతులు మాట్లాడుతూ…‘‘ఓ స్ఫూర్తిదాయకమైన సినిమా ఫంక్షన్‌ మా కాలేజ్‌లో జరగడం ఆనందంగా ఉంది. ఈ సినిమా విజయవంతం కావాని కోరుకుంటున్నాం’’ అన్నారు.

దేవిప్రసాద్‌, వాయు తనయ్‌, శశి, సుచిత్ర, నళిని కాంత్‌, రామరాజు, శుభలేఖ సుధాకర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః ఫణి కళ్యాన్‌, కెమెరాఃకమలాకర్‌, రచన సహకారంః హిరణ్మయి-సత్య జేబి, నిర్మాతలుః అట్లూరి నారాయణరావు, ఆలూరి సాంబశివరావు; రచన-దర్శకత్వంః మోహన్‌ రావిపాటి.

http://industryhit.com/t/2019/02/nene-mukhyamanthri-pre-release-event-pics/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here