హార్డ్‌వర్క్‌కి మంచి ఫలితం ఉంటుందనడానికి మా ‘హుషారు’ సినిమా విజయమే నిదర్శనం – నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌

0
96

లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్‌, రియాజ్‌ నిర్మాతలుగా శ్రీహర్ష కొనుగంటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘హుషారు’. తేజస్‌ కంచర్ల, తేజ్‌ కొర్రపాటి, అభినవ్‌ మంచు, దినేష్‌ తేజ్‌, దక్ష నగార్కర్‌, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్‌ 14న విడుదలై 50 రోజులను పూర్తి చేసు కున్న సందర్భంగా హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో 50 డేస్‌ ఫంక్షన్‌ సెలబ్రేట్‌ చేశారు.ఈ సందర్భంగా నటీనటులు, ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌కి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు షీల్డ్స్‌ ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా..

హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – ” అంతా కొత్త వారితో వేణుగోపాల్‌ గారు ఈ సినిమాను నిర్మించి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. సినిమా ఫస్ట్‌ సాంగ్‌ లాంచ్‌ రోజునే సినిమా బాగా ఉందని, ఆడేలా ఉందని చెప్పాను. నిజంగానే సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఈరోజుల్లో సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ఎంతో హార్డ్‌వర్క్‌తో పాటు లక్‌ కూడా ఉండాలి. అందుకు నేను వేణుగోపాల్‌గారిని, దర్శకుడు హర్షను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. లక్కి మీడియా ద్వారా వేణు ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని, హర్షకు డైరెక్టర్‌గా మంచి ఫ్యూచర్‌ ఉండాలని కోరుకుంటూ.. ఈ సినిమాకు పని చేసిన ఎంటైర్‌ యూనిట్‌కు నా అభినందనలు”అన్నారు.

నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ – ”మా ‘హుషారు’ సినిమాను ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్‌. దిల్‌ రాజుగారు ఈ సినిమాను నా సినిమా అనుకొని చాలా హెల్ప్‌ చేశారు. శిరీష్‌ గారు సినిమాకు ఎక్కువ ధియేటర్స్‌ రావాలని మంచి ప్లానింగ్‌ చేశారు. పెద్ద సినిమాలతో పాటు రిలీజ్‌ అయ్యి ఇంత పెద్ద విజయాన్ని సాధిస్తుందని నేను ఊహించలేదు. కొన్ని ఏరియాల్లో షిఫ్టింగ్‌తో.. శ్రీ మయూరిలో ఫుల్‌ రన్‌తో 50 రోజులు వరకు సినిమా రన్‌ అయ్యింది. హార్డ్‌వర్క్‌కి మంచి పేరు వస్తుందనడానికి మా ‘హుషారు’ సినిమా విజయమే నిదర్శనం. ఈ సినిమా కోసం యూనిట్‌ అందరం ఏడాదిన్నర పాటు కష్టపడ్డాం. ఈ సినిమా నాకు కూడా ఒక గొప్ప ఎక్స్‌పీరియెన్స్‌. ఈ సినిమా పాటలు, ట్రైలర్‌ బయటకు వచ్చినప్పుడు వచ్చిన రెస్పాన్స్‌తో మాలో నమ్మకం బాగా పెరిగింది. శ్రీహర్ష చాలా ఓపికగా, ఒక్క షాట్‌లో కూడా కాంప్రమైజ్‌ కాకుండా చేశాడు. ఈ సందర్భంగా హర్షను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సినిమాలో నటించిన హీరోహీరోయిన్లతోపాటు ఎంటైర్‌ యూనిట్‌కు, నాకు సహకరించిన ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌, డిస్ట్రిబ్యూటర్‌లకు ప్రతి ఒక్కరికి థాంక్స్‌” అన్నారు.

దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి మాట్లాడుతూ – ”నా లైఫ్‌లో ఈ సినిమాకు పనిచేసిన 2సంవత్సరాలలో ప్రతిరోజూ నాకు బెస్ట్‌ మెమొరీ. ప్రేక్షకులు సినిమాను 5,6 సార్లు రిపీటెడ్‌గా చూసి ఇంత పెద్ద హిట్‌ ఇచ్చారు. దిల్‌ రాజు గారిది గోల్డెన్‌ హ్యాండ్‌, ఆయన ఫస్ట్‌ సాంగ్‌ లాంచ్‌ నుండి ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అన్నారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ గారు నేను చెప్పిన 5 నిమిషాల కథ విని.. చాలా ఎగ్జయిట్‌ అయ్యి సినిమాను చేయడానికి నాతో ట్రావెల్‌ చేశారు. ఆయన బ్యానర్‌లో కాకుంటే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించేది కాదు. ఆయన వల్లనే ఈ ప్రాజెక్ట్‌లోకి చాలా మంది టెక్నీషియన్స్‌ వచ్చారు. అందుకు ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా చేయడానికి మా తల్లి గారు చాలా సపోర్ట్‌ చేశారు. ‘వెల్లేటప్పుడు ఈ లోకం లోనుండి ఏమి తీసుకుపోము’ అనేది ఈ సినిమా థీమ్‌. కష్టపడి పని చేస్తే ఏదైనా సాధించగలం అనే సందేశాన్ని ఆడియెన్స్‌ కరెక్ట్‌గా రిసీవ్‌ చేసేకున్నారు. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్‌కు మా కంటే ఎక్స్‌పీరియెన్స్‌ ఉన్నా.. మాతో ఫ్రెండ్స్‌లా కలిసిపోయి బెస్ట్‌ ఔట్‌పుట్‌ కోసం చాలా కష్టపడి పని చేశారు. ఈ టీమ్‌తో తప్పకుండా మరోసారి సినిమా తీస్తాను”అన్నారు.

హీరో తేజస్‌ కంచెర్ల మాట్లాడుతూ – ” సినిమాను చాలా పెద్ద హిట్‌ చేసిన ఆడియెన్స్‌కు చాలా పెద్ద థాంక్స్‌. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌ బెక్కెం వేణుగోపాల్‌ గారికి, దర్శకుడు హర్షకు నా దన్యవాదాలు” అన్నారు.

తేజ్‌ కొర్రపాటి మాట్లాడుతూ – ” ఈ సినిమాలోనాది బంటి క్యారెక్టర్‌. వేణుగోపాల్‌గారి వద్ద నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. ఈ సినిమాలో నాపై నమ్మకంతో యాక్టర్‌ని చేశారు. మా నెక్ట్స్‌ సినిమా కూడా ఇంతే పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దినేష్‌ తేజ్‌ మాట్లాడుతూ – ”ఈరోజుల్లో చిన్న సినిమా 50 రోజులు ఆడుతుందంటే చాలా పెద్ద విషయం. డైరెక్టర్‌ హర్ష, నిర్మాత వేణుగోపాల్‌గారికి థాంక్స్‌. అందరం బాగా కష్టపడ్డాం. ఎమోషనల్‌గా ఈ సినిమా నాకెంతో స్పెషల్‌ ”అన్నారు.

హీరోయిన్‌ ప్రియా వడ్లమాని మాట్లాడుతూ – ” నేను సైన్‌ చేసిన మొదటి సినిమానే 50 రోజులు ఆడటం గొప్ప విషయం. ఈ సినిమాకు అందరం చాలా కష్టపడి పని చేశాం. ఈ సక్సెస్‌కు కారణమైన దర్శకనిర్మాతలు, టెక్నిషియన్స్‌లందరికీ థాంక్స్‌” అన్నారు.

హీరోయిన్‌ దక్షనగార్కర్‌ మాట్లాడుతూ – ” సినిమాను పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు, సినిమాను ఇంత గొప్పగా చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్‌. ఈ సినిమా నాకు మంచి విజయం,జ్ఞాపకాన్ని అందించింది’ అన్నారు.

హనుమంతరాజు (హర్ష తండ్రి) మాట్లాడుతూ – ”మా అబ్బాయి డైరెక్ట్‌ చేసిన తొలి చిత్రం యాబై రోజుల ఫంక్షన్‌కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకు మా హర్ష చాలా కష్టపడి పనిచేసాడు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత వేణుగోపాల్‌ గారికి థాంక్స్‌. సినిమాను ఇంత పెద్ద హిట్‌ చేసిన ఆడియన్స్‌కి నాకృతజ్ఞతలు ” అన్నారు.

కమల్‌ మాట్లాడుతూ – ”దిల్‌ రాజు గారి సహాకారంతో హర్ష, గోపి గారు మంచి విజయాన్ని అందుకున్నారు. గోపి గారు నాకు ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ నుండే తెలుసు. ఆయన్ను చాలా దగ్గరనుండి చూస్తూ వచ్చాను. గోపి 24/7 సినిమా గురించే ఆలోచిస్తుంటారు” అన్నారు

లిరిసిస్ట్‌ కె.కె మాట్లాడుతూ – ”ఈ సినిమా స్టార్టింగ్‌ నుండి నేను ఈ టీమ్‌తో కలిసి ట్రావెల్‌ అవుతున్నాను. మూడవ వారంలో కూడా సినిమాకు ఆడియెన్స్‌ తగ్గలేదు. చాలా ఎంజాయ్‌ చేస్తూ సినిమా చూశాను” అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ రథన్‌ మాట్లాడుతూ – ”సినిమాలోని అన్ని పాటలు చాలా బాగున్నాయి. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌ బెక్కెం వేణుగోపాల్‌ గారికి, దర్శకుడు హర్ష కు నా దన్యవాదాలు” అన్నారు.

http://industryhit.com/t/2019/02/hushaaru-50-days-celebrations-pics/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here