కొప్పినీడి వారి ఆహ్వానం మేరకు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

0
4

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బంధువులు కొప్పినీడి వారి ఆహ్వానం మేరకు కుటుంబంతో కలిసి సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాలకొల్లు దగ్గర్లోని కాజా గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని అతిథి మర్యాదలు స్వీకరించారు. అల్లు అర్జున్ కుటుంబం రాకతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. తమ అభిమాన నటుడిని చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఆ తర్వాత పవిత్ర గోదావరి నదిలో కుటుంబంతో కలసి బోట్ లో ప్రయాణించారు. తెలుగు సంప్రదాయాలు, పండగలన్నా అల్లు అర్జున్ కి ఎంతో ఇష్టం. తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన సంక్రాంతి పండగను కొప్పినీడి బంధువులతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. 15వ తేదీన సంక్రాంతి పర్వదినం సందర్భంగా పంచారామాల్లో ఒకటైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం సందర్శిస్తారు. అక్కడ జరిగే ప్రత్యేక పూజల్లో అల్లు అర్జున్ కుటుంబం పాల్గొననుంది.

http://industryhit.com/t/2019/01/stylish-star-allu-arjun-at-palakollu-pics/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here