‘పేట’ లో పాతికేళ్ళ మునుపటి రజనీకాంత్‌ని చూస్తారు – అశోక్ వల్లభనేని

0
319

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఫస్ట్‌ క్రేజీకాంబినేషన్‌లో సన్‌పిక్చర్స్‌ బ్యానర్‌పై స్టార్‌ ప్రొడ్యూసర్‌ కళానిథి మారన్‌ సమర్పిస్తున్న చిత్రం ‘పేట’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఇటీవల మణిరత్నం ‘నవాబ్’, విజయ్ ‘సర్కార్’ చిత్రాలని తెలుగులో విజయవంతంగా విడుదల చేసిన అశోక్‌ వల్లభనేని ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అశోక్‌ వల్లభనేని ఇంటర్య్వూ.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గురించి?
– సాదారణ బస్‌ కండెక్టర్‌గా జీవితాన్ని స్టార్ట్‌ చేసిన రజనీకాంత్‌గారు నేడు ఆలిండియా సూపర్‌స్టార్‌గా ఎదిగారు. రేపు రాజకీయాల్లోకి వస్తారు అని కూడా అంటున్నారు. ఆయన జీవితమే నాకు స్ఫూర్తి. దాని వల్లే రజనీకాంత్‌గారితో సినిమా చేయగలిగే స్థాయిని అందుకోగలిగాను. ఆయనలో ఎన్నో సేవాగుణాలున్నాయి. తమిళ ప్రజలకు ఎంతో మేలు చేసిన రజనీకాంత్‌గారు తెలుగు ప్రజలకు ఏం చేశారనేదానికి సమాదానంగా జనవరి 6న హైదరాబాద్‌లో జరగబోయే ‘పేట’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో మంచి సేవలను అందిస్తోన్న కొన్ని అనాథ శరణాలయాలకు స్వయంగా రజనీకాంత్‌గారి చేతుల మీదుగా నగదు ప్రోత్సాహకాన్ని చెక్స్‌ రూపంలో అందించబోతున్నాం.

‘పేట’ సినిమా తెలుగు హక్కులను సాదించడం ఎలా అన్పించింది?
– తెలుగులో మణిరత్నంగారు డైరెక్ట్‌ చేసిన ‘నవాబ్‌’ సినిమాను నేనే స్వయంగా రిలీజ్‌ చేసి హిట్‌ కొట్టాను. అదేవిధంగా ‘సర్కార్‌’ సినిమాను అనుకున్న టైంలో రిలీజ్‌ చేసి విజయ్‌గారికి తెలుగులో మార్కెట్‌ను క్రియేట్‌ చేశాం. అదే నమ్మకంతో సన్‌పిక్చర్స్‌ సంస్థ నాకు ఈ సినిమా తెలుగు హక్కులను ఇచ్చినందుకు సన్‌పిక్చర్స్‌ సంస్థకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు .

డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌ మేకింగ్‌ గురించి?
– కార్తీక్‌ సుబ్బరాజ్‌గారు రజనీకాంత్‌గారికి వీరభక్తుడు. ఈ సినిమాతో ఖచ్చితంగాసూపర్‌ హిట్‌ కొడతాడని నమ్మకంగా ఉన్నారు. ట్రైలర్‌లో రజనీకాంత్‌గారి లుక్స్‌, నడక, స్టైల్‌ చూస్తుంటే ఆయన పాతికేళ్లు వెనక్కి వెళ్లిపోయారనిపించేంత గొప్పగా ఉంది. ‘పేట’ ట్రైలర్‌ తమిళనాడు లోనేకాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ట్రెండింగ్‌లో ఉంది.

ఆడియో రెస్పాన్స్‌ ఎలా ఉంది?
– మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ ‘పేట’ సినిమాకు వెర్సటైల్‌ మ్యూజిక్‌ అందించారు. తమిళ్‌లోనే కాదు తెలుగులో కూడా పాటలకు చాలా మంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తుంది.

సినిమా గురించి చెప్పండి?
– సినిమా విషయానికి వస్తే.. ‘పేట’ అంటే ఓ ప్రాంతం లేదా ఏరియా అని అర్థం . నేను ఒక గంట పాటు సినిమాను చూడడం జరిగింది. స్టోరీ గురించి ఇప్పుడే ఎం చెప్పలేను కాని… రజనీకాంత్‌గారి గత చిత్రాలతో పోల్చితే ‘పేట’ నెక్స్‌ట్‌ లెవల్‌ మూవీ..అని మాత్రం చెప్పగలను.

‘పేట’ సినిమాను తెలుగులో ఎన్ని థియేటర్‌ లలో రిలీజ్‌ చేస్తున్నారు?
– సినిమా బావున్నప్పుడు థియేటర్స్‌ ఆటోమెటిక్‌గా పెరుగుతాయి. ఉదాహరణకు సోగ్గాడే చిన్ని నాయనా సినిమా తక్కువ థియేటర్స్‌లో విడుదలైనా, పెద్ద హిట్‌ అయ్యింది. మంచి సినిమా అనే నమ్మకంతో ఈ సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తున్నాం. ఇప్పటికే 50 శాతం బిజినెస్‌ పూర్తయ్యింది. మరో 50 శాతం బిజినెస్‌ ప్రాసెస్‌లో ఉంది.

తెలుగులో స్ట్రయిట్‌ సినిమా ఎప్పుడు చేస్తున్నారు?
– ఈ సంవత్సరం తెలుగులో చలో,గరుడ వేగ సినిమాలకు ఫైనాన్స్‌ చేశాను స్ట్రయిట్‌ సినిమాను ఈ ఏడాదిలో ప్లాన్‌ చేస్తున్నాం. కథలు వింటున్నాను. మంచి కథ, హీరో దొరకగానే అనౌన్స్‌ చేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here